విద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.67,700 వేతనంతో జాబ్స్..?

NPCIL Recruitment 2021

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కొన్ని నెలల క్రితం జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 72 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల కాగా నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఎన్‌పీసీఐఎల్ ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్, స్టేషన్ ఆఫీసర్ విభాగాలను భర్తీ చేయనుంది.

ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారికి అర్హత, అనుభవం ఆధారంగా 47,000 రూపాయల నుంచి 67,700 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 20వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ నెల 20వ తేదీ సాయంత్రంలోగా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

https://npcil.nic.in/ వెబ్ సైట్ ద్వారా నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 72 ఖాళీలలో టెక్నికల్ ఆఫీసర్/డీ-మెకానికల్ విభాగంలో 28 ఖాళీలు ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 67,700 రూపాయలు వేతనంగా లభిస్తుంది. టెక్నికల్ ఆఫీసర్/డీ-ఎలక్ట్రికల్ విభాగం లో 10 ఖాళీలు ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి కూడా 67,700 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.

టెక్నికల్ ఆఫసీర్/డీ-సివిల్ విభాగంలో 12 ఉద్యోగ ఖాళీలు, మెడికల్ ఆఫీసర్/డీ(స్పెషలిస్ట్స్) విభాగంలో 8 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి కూడా 67,700 రూపాయలు వేతనంగా లభిస్తుంది. మెడికల్ ఆఫీసర్/సీలో 7 ఖాళీలు ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 56,100 రూపాయలు వేతనంగా లభిస్తుంది. డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్/ ఏ విభాగంలో 3 ఖాళీలు ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ. 56,100 వేతనంగా లభిస్తుంది. మిగిలిన ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.47,600 వేతనంగా లభించనుందని సమాచారం.

Back to top button