విద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు..?

NTPC Recruitment 2021

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసిన ఎన్టీపీసీ మళ్లీ 35 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. https://ntpccareers.net/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 15 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా ఎన్టీపీసీ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 35 ఖాళీలలో ఎగ్జిక్యూటివ్ ‌(సేఫ్టీ) ఉద్యోగ ఖాళీలు 25, క్యూటివ్ ‌(ఐటీ–డీసీ/ డీఆర్‌) ఉద్యోగ ఖాళీలు 8, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్ ‌(సోలార్‌) ఉద్యోగ ఖాళీలు 1, స్పెషలిస్ట్ ‌(సోలార్‌) ఉద్యోగ ఖాళీలు 1 ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీగా వేతనం లభిస్తుంది. 35 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు 300 రూపాయలుగా ఉంది.

https://www.ntpc.co.in/ వెబ్ సైట్ ద్వారా కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ఈ నెల 1వ తేదీన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కొంత సమయం మాత్రమే ఉండటంతో వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.

Back to top button