టాలీవుడ్సినిమా

NTR: చిరంజీవి ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ గిఫ్ట్

NTR Evaru Meelo Koteswarulu Show

బుల్లితెర చరిత్రలో ఎన్నో కార్యక్రమాలు ప్రజలను మెప్పించాయి. టెలివిజన్ చరిత్రలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ షోల ద్వారా ప్రేక్షకుల మన్ననలు పొందాయి. సుదీర్ఘమైన కార్యక్రమాల ద్వారా మనసులను కట్టి పడేస్తున్నాయి. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం ద్వారా క్విజ్ గేమ్ షోగా అందరి దృష్టిని ఆకర్షించనుంది. ఈనేపథ్యంలో దీనిపై ఇప్పటికే పలు సంచలనాలు నమోదవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసే ఈ కార్యక్రమం ద్వారా జెమిని టీవీ మరింత టీఆర్పీ రేటింగ్ పెరిగేందుకు దోహదపడనున్నారు.

సామాన్యులను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో హిందీలో చాలా కాలం క్రితమే వచ్చిన కౌన్ బనేగా కరోడ్ పతి ఆధారంగా తెలుగులోకి వచ్చిన షోనే మీలో ఎవరు కోటీశ్వరుడు. తెలుగులోనూ దీన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేశారు. ఇందులో మొదటి మూడింటిలో నాగార్జున, నాలుగో దానిలో చిరంజీవి హోస్ట్ చేశారు. అయితే మొదటి మూడు షోలు సూపర్ హిట్ కాగా నాలుగోది మాత్రం కరోనా కారణంగా రద్దయింది.

మీలో ఎవరు కోటీశ్వరుడు షోను ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు అని మార్చారు. అయితే ఈ సీజన్ ను విజయవంతం చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ తాపత్రయ పడుతున్నారు. దీని కోసం మార్పులు చేర్పులు చేపట్టారు. ప్రేక్షకుల్లో కూడా భారీగానే అంచనాలు పెరిగాయి టాలీవుడ్ హీరో టైగర్ జూనియర్ ఎన్టీఆర్ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇప్పటికే పరిచయ ప్రోమోలో తన పేరు రామారావు అని చెప్పిన తారక్ ఈ షోను ముందుకు తీసుకెళ్లేలా శ్రద్ధ కనబరుస్తున్నట్లు సమాచారం.

నిజానికి మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది సాధ్యం కాలేదు. మొదటి షెడ్యూల్ లో భాగంగా ఏకంగా 16 ఎపిసోడ్ లు పూర్తయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుగుతోంది ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తారనే టాక్ ఉన్నా ఆగస్టు 22 నుంచి ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.

అయితే ఈ షోకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్టు గా వస్తారని ప్రచారం సాగుతోంది. ఆయన రూ.25 లక్షలు గెలిచారని చెబుతున్నారు. మెగాస్టార్ పుట్టినరోజుకు చరణ్, తారక్ కలిసి ఎవరు మీలో కోటీశ్వరుడు షోను మొదలు పెట్టనున్నారని సమాచారం. అందుకే మెగా అభిమానులకు కానుక అంటున్నారు. ఇది టాలీవుడ్ లో మంచి సంకేతాలు ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Back to top button