వైరల్సినిమా వార్తలు

రాంచరణ్ కు ఎన్టీఆర్ వెరైటీ శుభాకాంక్షలు

NTR Variety wishes Rancharan

రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ తారలు, సెలబ్రెటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ హోరెత్తిస్తున్నారు.

తాజాగా ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ తోపాటు నటించిన కొమురం భీం ఎన్టీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ ‘ఈ సంవత్సరం మనకు గొప్పగా మారబోతోంది. నీతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మధురమైనవే బ్రదర్. జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ తారక్ ఆర్ఆర్ఆర్ సెట్లో రాంచరణ్ తో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

తారక్, చరణ్ కలిసి దిగిన ఈ ఫొటో వైరల్ గా మారింది. ఇక నిన్న ఆర్ఆర్ఆర్ సెట్ లో రాంచరణ్ జన్మదిన వేడుకలను రాజమౌళి గొప్పగా ప్లాన్ చేశారు. చరణ్ తో కేక్ కట్ చేయించారు.

Back to top button