ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

నూతన్‌ నాయుడి బెయిల్‌ పిటిషన్ రద్దు

మరికొందరి నిందితుల బెయిల్‌ పిటిషన్లు కూడా..

Nutan naidu
పెందుర్తి దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరోముండనం చేసిన కేసులో నూతన్‌ నాయుడును, అతని కుటుంబ సభ్యులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ కేసులో నూతన్‌ నాయుడు సహా మరికొందరు నిందితులు వేసిన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. విశాఖనగరంలోని ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి వెంకటనాగేశ్వరరావు వీరి పిటిషన్‌ను రద్దు చేశారు.

Also Read: అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ : జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ

శ్రీకాంత్‌ శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు, అతని భార్య ప్రియమాధురి సహా మరికొందరు నిందితులుగా ఉన్నారు. వీరిని ఇప్పటికే అరెస్టు చేయగా.. అప్పటి నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. తాజాగా బెయిల్‌ పిటిషన్లను దాఖలు చేయగా.. విచారించిన కోర్టు మంగళవారం రిజక్ట్‌ చేయడంతో నూతన్‌నాయుడు ఖంగుతిన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జి ఈ తీర్పునిచ్చారు.

ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌‌ శ్రీనివాస్‌ ఈ కేసులో వాదనలు వినిపించారు. శిరోముండనం కేసులో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్న నూతన్‌ నాయుడిని ఈనెల 4వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందే నూతన్‌ నాయుడు భార్య ప్రియమాధురి సహా పలువురిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌ చేశారు.

Also Read: పవన్ కు అవమానం.. పోలీస్ గడపతొక్కిన జనసేన

ఈ కేసు కొనసాగుతుండగా.. ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ పేరుతో నూతన్‌ నాయుడు పలువురు ఆఫీసర్లకు ఫోన్లు చేయించనట్లుగా కూడా వెల్లడైంది. దీంతో ఆయనపై మరో కేసు నమోదు చేశారు.

Back to top button