జాతీయం - అంతర్జాతీయం

ఐదేళ్లలో చమురు శుద్ధి సామర్థ్యం రెట్టింపు :మోదీ

Oil refining capacity double in five years: Modi

రాబోయే ఐదేళ్లలో చమురు శుద్ధి సామర్థ్యాన్నిరెట్టింపు చేసే పనిలో నిమగ్నమయ్యామని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శనివారం గుజరాత్ లోని పండిట్ దీన్ దయాల్ పెట్రోలియం విశ్వవిద్యాలయం కాన్వకేషన్ వేడుకలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశం కార్బన్ ఉద్గారాలను 30 నుంచి 35 శాతం తగ్గించే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. అలాగే కరోనా ప్రపంచంలో అనేక మార్పులు తీసుకొచ్చిందన్నారు. ఉపాధికి ఇప్పడు మంచి అవకాశాలున్నాయన్నారు. విద్యార్థుల నైపుణ్యం, ప్రతిభ ద్వారా ెదిగి ఆత్మ నిర్బర్ భారత్ మిషన్కు క్రుషి చేయాలన్నారు. ఇంధన రంగంలో స్టార్టప్ లను బలోపేతం చేసే పని నిరంతరం జరుగుతోందని, ఇందుకు ప్రత్యేక నిధిని కేటాయించినట్లు మోదీ తెలిపారు.

Back to top button