జాతీయంరాజకీయాలు

బాబు బ్రాండ్ ఇమేజ్ కాశ్మీర్ దాకా పాకింది.


బాబుకు ఏళ్లుగా ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయనను వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసడర్ గా చెప్పుకుంటారు. పిల్లనిచ్చి, పదవులు కట్టబెట్టిన మామ ఎన్టీఆర్ కి గ్రూపు రాజకీయాల దెబ్బేమిటో అప్పట్లోనే చూపించాడు. చంద్రబాబు వైస్రాయ్ హోటల్ రాజకీయం అనేక మందికి స్ఫూర్తిగా నిలిచింది. అందుకే ప్రభుత్వాలను పడగొట్టాలన్నా, నిలబెట్టాలన్నా శాసన సభ్యులను హోటళ్లలో దాచి రాజకీయాలు చేస్తున్నారు. అంత గొప్పగా గ్రూపు రాజకీయాలను జాతీయ స్థాయిలో పాపులర్ చేసిన నాయకుడు చంద్రబాబు. చంద్రబాబు దగ్గర ఉన్న మరో ఉత్తమ క్వాలిటీ అవకాశవాద రాజకీయం. ఎవడైనా అవసరం ఉన్నంత వరకే, తరువాత కనీసం పట్టించుకోవడం కూడా మానేస్తాడు.

Also Read: విద్యావ్యాపారాన్ని ప్రక్షాళించిన మోదీ

అవసరం ఉంటే భజన చేస్తూ చుట్టూ తిరిగే బాబు, లేదంటే కనీసం కన్నెత్తి కూడా చూడడు. అందరికీ తెలిసిన ఈ విషయం జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి జె కె ఎన్ సి నేత ఒమర్ అబ్దుల్లాకు ఇప్పుడే అవగతం అయినట్లు ఉంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పట్ల బీజేపీ తీరును విమర్శిస్తూ తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన, చంద్రబాబు నమ్మక ద్రోహాన్ని, అవకాశవాద రాజకీయాలను ప్రస్తావించడం జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో ముస్లిమ్ మైనారిటీ ఓట్ల కోసం టీడీపీ తరుపున ప్రచారానికి ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూఖ్ అబ్దుల్లాను బాబు దించారు. ఆయన చంద్రబాబును ఓ రేంజ్ లో ఎలివేట్ చేయడం జరిగింది. అలాగే జగన్ మరియు బీజేపీ పై విమర్శలు గుప్పించారు. ఎన్నికలు అయిపోయాయి, ఫరూక్ అబ్దుల్లా ప్రసంగాలు పనిచేయలేదని బాబుకు అర్థం అయ్యింది. దానితో ఫరూక్ అనే నేత ఉన్నాడన్న సంగతి బాబు మర్చిపోయాడు.

Also Read: బాబు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారా?

కాగా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో సంక్షోభం కొనసాగుతుండగా, బాబు ఒక్కమాట కూడా మాట్లాడకపోవడాన్ని ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఒమర్ అబ్దుల్లా తప్పుబట్టారు. ఆనాడు ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం నాన్నగారి చేత ప్రచారం చేయించుకున్న చంద్రబాబు అవసరం తీరగానే పట్టించుకోవడం లేదు అన్నారు. ఇప్పుడు ఒమర్ అబ్దుల్లాకు అనుకూలంగా, బీజేపీ కి వ్యతిరేకంగా బాబు ఎలా మాట్లాడుతాడు చెప్పండి. బాబు అప్పటి అవసరాలు వేరు, ఇప్పటి అవసరాలు వేరు. ఆయన మనసు ప్రస్తుతం బీజేపీ తో స్నేహం కోరుకుంటుంది. ఏది ఏమైనా ఇప్పటి దాకా తెలుగు రాష్ట్రాలకే తెలిసిన చంద్రబాబు అనారోగ్యకర రాజకీయాలు దేశ వ్యాప్తంగా తెలిశాయి. బాబు మార్కు రాజకీయాలు ఎలా ఉంటాయా అని ప్రముఖులు ముక్కున వేలు వేసుకుంటున్నారు.

Tags
Show More
Back to top button
Close
Close