జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ

Once again there are more new cases than recoveries

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. క్రితం రోజు 35వేలకు దిగొచ్చిన కేసులు  తాజాగా మళ్లీ పెరిగాయి. అంతేగాక, వైరస్ నుంచి కోలుకున్నవారి కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా 16.31 లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా 39,097 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 3.13 కోట్లు దాటాయని కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. 24 గంటల వ్యవధిలో మరో 546 మందిని కొవిడ్ బలితీసుకుంది. ఇక కొత్త కేసులు అధికమవడంతో యాక్టివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి.

Back to top button