జనరల్టెక్నాలజీ

స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త.. తక్కువ ధరకే 5జీ మొబైల్..!

దేశంలో 5జీ స్మార్ట్ ఫోన్లు గత కొన్ని నెలల నుంచి యూజర్లకు అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే 4జీ ఫోన్లతో పోల్చి చూస్తే 5జీ ఫోన్ల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది 5జీ ఫోన్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే ఒప్పో కంపెనీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తక్కువ ధరకే 5జీ బడ్జెట్ మొబైల్ ను అందుబాటులోకి తెచ్చింది.

స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్ తో తయారవుతున్న 5జీ మొబైల్ ఫోన్ల ఉత్పత్తి చైనా ప్రారంభమైంది. ఒప్పో ఏ93 5జీ మొబైల్ మోడల్ ఉత్పత్తి చైనా దేశంలో ఇప్పటికే మొదలైంది. ఒప్పో నుంచి అందుబాటులోకి వస్తున్న తొలి 5జీ బడ్జెట్ మొబైల్ ఇదే కాగా 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సామర్ధ్యంతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తూ ఉండటానికి గమనార్హం.

ఒప్పో కంపెనీ మూడు కలర్ ఆప్షన్స్ లో రెండు స్టోరేజ్ మోడల్స్ లో ఈ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లేతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌ మోడల్ ధర మన దేశ కరెన్సీ ప్రకారం 22,500 రూపాయలుగా ఉంది. బ్లాక్, అరోరా, సిల్వర్ కలర్ లలో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది.

ఈ ఫోన్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. యుఎస్ బి టైపు సీ పోర్టుతో ఈ ఫోన్ పని చేస్తుంది. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, వైఫై, బ్లూటూత్ 5.1 ఉన్నాయి. సెల్ఫీలు + వీడియో కాలింగ్ కొరకు ఈ ఫోన్ లో 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

Back to top button