వైరల్సినిమా

వర్మ హీరోయిన్లు.. లైన్లో పడుతున్నారా?

Opportunities in Tollywood for Varma heroines

సంచలనాలకు.. కాంట్రవర్సీటీ కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రాంగోపాల్ వర్మ. ‘శివ’ సినిమాతో టాలీవుడ్లో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత బాలీవుడ్లోనూ పలు సూపర్ హిట్టు మూవీలను తీశాడు. అయితే గతకొంతకాలంగా వర్మ తెరకెక్కించే సినిమాలన్నీ కూడా ప్లాపు టాక్ తెచ్చుకుంటున్నాయి.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ అలా.. ఎన్టీఆర్ ఎలా?

వర్మ సినిమాలు ఫెయిలర్స్ అయినప్పటికీ వర్మ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇక కరోనా టైంలోనూ రాంగోపాల్ వర్మ వరుస సినిమాలు తీసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. దర్మక, నిర్మాతలు, హీరోలంతా ఇంటికే పరిమితమైతే వర్మ మాత్రం తనదైన మ్యాజరిజంలో పలు సినిమాలను తెరకెక్కించి ఇండస్ట్రీకి ఆదర్శంగా నిలిచాడు.

రాంగోపాల్ వర్మ కొత్త కొత్త హీరోయిన్లను పరిచయం చేయడమే కొత్తమే కాదు. వర్మ కాంట్రవర్సీలతో తన సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటూ క్యాష్ చేసుకుంటూ ఉంటాడు. ఆయన సినిమాల్లో నటించే హీరోయిన్లకు కూడా కావాల్సినంత పబ్లిసిటీ దొరకుతుంది. అయితే ఆ క్రేజ్ ను చాలామంది హీరోయిన్లు కంటిన్యూ చేయలేకపోతున్నారు.

వర్మ పరిచయం చేసిన హీరోయిన్లలో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా కొద్దిరోజుల్లోనే కనుమరుగు అవుతున్నారు. వర్మ హీరోయిన్లకు కావాల్సినంత గ్లామర్ ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్లుగా రాణించలేక చతికిలబడిపోతుండటం శోచనీయంగా మారింది. ఇక కరోనా టైంలోనూ వర్మ పలువురు హీరోయిన్లను పరిచయం చేశాడు.

‘థిల్లర్’ మూవీలో అప్పరరాణి.. ‘నగ్నం’లో శ్రీరాపాక(స్వీటీ)..ను పరిచయం చేశాడు. వీరిద్దరు ఇంతకముందే ఒకటి అర సినిమాల్లో నటించారు. అయితే వర్మ సినిమాలతో వీరిద్దరి కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది. దీనిని వారు కంటిన్యూ చేయలేకపోతున్నారు. తాజాగా అప్సరరాణికి రవితేజ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. అదేవిధంగా వర్మ తెరకెక్కిస్తున్న డేంజరస్ మూవీలో నటిస్తుంది.

Also Read: దివీ-అవినాష్ రోమాన్స్? ప్రేమలోకంలో ‘బిగ్ బాస్’ హౌస్?

శ్రీరాపాక ‘నగ్నం’లో హాట్ గా నటించి అడల్డ్ మూవీలకు కేరాఫ్ గా మారుతోంది. శ్రీరాపాక తాజాగా ‘లస్ట్’ మూవీలో నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ చూస్తే ‘నగ్నం’ సినిమాను మించిపోయేలా కన్పిస్తోంది. ‘లస్ట్’ మూవీ శ్రీరాపాకను దృష్టిలో ఉంచుకొనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వర్మ హీరోయిన్లు వరుస అవకాశాలతో క్రేజ్ నిలుపుకుంటారా? లేదా అందరిలాగే వీరిద్దరు కూడా సైడ్ అయిపోతారా? అనేది మాత్రం వేచి చూడాల్సిందే..!

Back to top button