అంతర్జాతీయంరాజకీయాలు

సరిహద్దుల్లో పాకిస్తాన్ కొత్త కుట్రలు

టన్నెల్స్ తవ్వుకొని బయటకు వస్తున్నఉగ్రవాదులలు..

Pakistan border terroristsభారత్ తో నేరుగా తలపడలేని పాకిస్తాన్ సరిహద్దుల్లో కొత్త కుట్రలు చేస్తోంది. ఇప్పటికే కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఎగదోసి రక్తపాతాన్ని సృష్టించిన పాకిస్తాన్.. బీజేపీ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఊపిరిసలపని పరిస్థితిని ఎదుర్కొంటోంది. సరిహద్దుల్లోనే ఉగ్రవాదులను ఏరివేస్తూ భారత సైన్యం  పకడ్బందీగా కాపు కాస్తోంది.

Also Read : మన కరోనా వ్యాక్సిన్‌ మరింత లేట్‌..వచ్చే ఏడాదే?

దీంతో పాకిస్తాన్ కొత్త ఎత్తులు వేస్తోంది. టన్నెల్స్ తవ్వుకొని వాటి ద్వారా బయటకు వస్తున్నారు. దేశంలో కల్లోలం సృష్టించేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులను టన్నెల్స్ ద్వారా భారత్ లోకి పంపుతోందని తెలిసింది.   ఉగ్రవాదులను చేరవేసేందుకు పాకిస్తాన్ సరిహద్దుల వద్ద భూ సొరంగాలను నిర్మిస్తోందని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ తెలిపారు.

సరిహద్దుల ద్వారా ఉగ్రవాదులపై పటిష్ట నిఘా ఉండడం.. భారత సైన్యం ఎన్ కౌంటర్లతో లేపేస్తుండడంతో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇప్పుడు టన్నెల్స్ తవ్వుకొని భూ గర్భం లోంచి భారత్ లోకి ప్రవేశిస్తున్నారు. ఈ కొత్త తరహాలో సొరంగాలను జమ్మూ సరిహద్దుల్లో సైన్యం గుర్తిస్తోంది. వెంటనే వాటిని పూడ్చివేస్తూ సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేస్తోంది. ఈ మేరకు చర్యలు చేపట్టినట్టు డీజీపీ తెలిపారు.

ఉగ్రవాదులను టన్నెల్స్ ద్వారా భారత్ లోకి పంపిస్తూ వారికి ఆయుధాలను డ్రోన్ల ద్వారా అందిస్తోందని డీజీపీ తెలిపారు. తాజాగా  జమ్మూలోని సాంబ జిల్లా గలార్ గ్రామంలో  170 మీటర్ల పొడవైన సొరంగం గుర్తించామన్నారు. సరిహద్దుల్లో ఉన్న టన్నెల్లను గుర్తించి నిర్వీర్యం చేసేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టామని తెలిపారు.

ఇలా భారత్ పైకి దొడ్డిదారిలో ఉగ్రవాదులను పంపిస్తూ పాకిస్తాన్ కుటిల నీతిని అవలంభిస్తోంది. ఈ సొరంగాల ద్వారా ఎంత మంది వచ్చారు? ఎక్కడున్నారనే దానిపై సైన్యం ఆరాతీస్తోంది. సరిహద్దు గ్రామాల్లో సొరంగాలపై మొత్తం జల్లెడ పడుతోంది.

Also Read : హీరో కావాల్సిన లోకేష్ పొలిటీషన్ ఎలా అయ్యాడు?

Back to top button