వ్యాపారము

ఆధార్ తో పాన్ కార్డ్ లింక్ చేసుకోవాలా.. ఆప్షన్లు ఇవే..?

Aadhaar Link Up With Pan Card.

ఆదాయపు పన్ను శాఖ ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేసుకోవాలని లేకపోతే పాన్ కార్డ్ రద్దవుతుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 2021 సంవత్సరం మార్చి 31వ తేదీ ఆధార్ కార్డ్ కు పాన్ కార్డ్ లింక్ చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ చాలాసార్లు ఆధార్ పాన్ లింక్ గడువును పొడిగించగా ఈసారి గడువును పొడిగించకపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

Also Read: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. మార్చిలో సెలవులు ఎన్నిరోజులంటే..?

ఆధార్ కార్డుతో పాన్ కార్డును సులభంగా ఇంటి నుంచే లింక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ చేసే సమయంలో రెండు కార్డులలో పొందుపరిచిన సమాచారం ఇకే విధంగా ఉండాలి. అలా లేకపోతే మాత్రం అభ్యర్థన తిరస్కరించబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. డేటా సరిపోకపోవడం వల్ల అభ్యర్థన తిరస్కరించబడితే బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: 50 లీటర్ల పెట్రోల్ ఫ్రీగా పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

ఇందుకోసం ఎన్‌ఎస్‌డిఎల్ పోర్టల్ నుండి ఆధార్ సీడింగ్ రిక్వెస్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆఫ్ లైన్ లో ఆధార్ ప్రామాణీకరణ ప్రక్రియను పూర్తి చేయాలి. పాన్ కార్డును కలిగి ఉంటే బ్యాంక్ ఖాతా తెరవడం, ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయడం, 50 వేలకు పైగా నగదు జమ చేయడం, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం సాధ్యమవుతుంది.

మరిన్ని వార్తలు కోసం: వ్యాపారము

పాన్ కార్డ్ రద్దైతే ఆ పాన్ కార్డును పొందడం కొరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ రద్దైన పాన్ కార్డును కలిగి ఉన్నవారిని పాన్ కార్డ్ లేనివారిగా పరిగణించనుంది.

Back to top button