బాలీవుడ్సినిమా

18 ఏళ్లకు మొదటి ముద్దు.. సీనియర్ హీరోతో ప్రేమ !

Parineeti Chopra
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రాకి మంచి క్రేజ్ ఉంది. ఇక ఆమె ముఖ్య పాత్రలో నటించిన ‘ది గాళ్‌ ఆన్‌ ది ట్రైన్‌’ సినిమా ఫిబ్రవరి 26న ఓటీటీలో విడుదలై, బ్యాడ్ టాక్ తెచ్చుకుని మొత్తానికి ప్లాప్ సినిమాగా క్రెడిట్ కొట్టేసింది. సినిమా ఎలాగూ ప్లాప్ అయింది, కనీసం ప్రమోషన్స్ లో అయినా కాస్త బోల్డ్ గా మాట్లాడితే.. ఆ రకంగానైనా తన సినిమా జనంలోకి వెళ్తుందనే ఆశతో పరిణీతి తన పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని రొమాంటిక్ సీన్స్ గురించి అంతే పచ్చిగా చెప్పుకొచ్చింది.

Also Read: భయపడ్డ స్టార్ హీరో.. ఇక మహాభారతం రాదు !

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్‌ లైఫ్‌ గురించి పరిణీతి చెబుతూ .. ‘తనకి 18 ఏళ్లు ఉన్నప్పుడే ఓ అబ్బాయిని ముద్దు పెట్టుకున్నానని, జీవితంలో తొలి ముద్దు ఎవరికైనా ప్రత్యేకమే అని, ఎవరైనా దాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని.. ఇక నా లైఫ్‌లోనూ ఆ ఫస్ట్‌ కిస్‌ నాకు చాలా స్పెషల్‌ అని తన ఫస్ట్‌ కిస్‌ గురించి ఇలా ఓపెన్‌ అయ్యింది ఈ భామ. ఇక డేట్ విషయం గురించి మాట్లాడుతూ… ఇప్పటివరకు తానెప్పుడూ డేట్ ‌కు వెళ్లలేదని, వాటి పై పెద్ద ఇంట్రెస్ట్‌ కూడా తనకు లేదని చెప్పుకొచ్చింది.

అలాగే డేట్‌ గురించి సీక్రెట్ కూడా చెబుతూ.. డేట్ అంటే ఇంటికి వచ్చేశెయ్‌..కలిసి భోం చేద్దాం, ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకొని తింటూ చిల్‌ అవుదాం’ అని చాలామంది అంటారని, దాన్ని నేను నమ్మను అని అంటుంది పరిణితి. ఇక పరిణీతి చోప్రా ఓ సీనియర్ హీరోని తెగ ప్రేమించేసిందట. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే.. ఆమె మాటల్లోనే వింటే.. పరిణీతి చోప్రా “నాకు ఫస్ట్‌ క్రష్‌ మాత్రం ఎప్పటికీ హీరో సైఫ్‌ అలీ ఖానే, నేను ఆయనను అభిమానించడమే కాదు,ప్రేమించాను కూడా చెప్పుకొచ్చింది.

Also Read: రిపీట్ అవుతున్న కాంబో.. స‌క్సెస్ రిపీట్ అవుతుందా?

ఇక ఇంతకుముందు అధిక బరువు కారణంగా చాలా ట్రోలింగ్‌కి గురయ్యాను. నాకు దేవుడు అవకాశం వస్తే నా జీవితంలో నేను లావుగా ఉన్న రోజులను చెరిపివేస్తానని అంటుంది. అధిక బరువుతో అనారోగ్యం కూడా వస్తుందని, అందుకే ఇప్పుడు ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెబుతుంది. స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా చెల్లెలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా..నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది పరిణితి.

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్

Back to top button