టాలీవుడ్వైరల్సినిమాసినిమా వార్తలు

మ‌ళ్లీ కలిసిన స్నేహితులు.. ఒకే వేదిక‌పై ప‌వ‌న్ – అలీ!

pawan-kalyan-ali
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సీనియర్ కమెడియన్ అలీ ఆప్త మిత్రులు అన్న సంగతి అంద‌రికీ తెలిసిందే. ప‌వ‌న్ సినిమా వ‌స్తోందంటే.. అందులో అలీ బెర్త్ క‌న్ఫాంగా ఉండేది. త‌న సినిమాలో అలీ లేకుంటే ఏదో వెలితిగా ఉంటుంద‌ని ప‌వ‌న్ స‌భాముఖంగానే ప్ర‌క‌టించారు.

అలాంటి ఇద్ద‌రూ రాజ‌కీయాల కార‌ణంగా మాటా మాటా అనుకున్నారు. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాజ‌మండ్రిలో అలీపై ప‌వ‌న్ కొన్ని వ్యాఖ్య‌లు చేయ‌గా.. దానికి ప్ర‌తిగా అలీ కూడా మాట్లాడిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత నుంచి వీరిద్ద‌రూ క‌లిసే సంద‌ర్భం రాలేదు.

Also Read: థియేటర్లో ‘ఆ నలుగురు!’.. మ‌రి, ద‌మ్ము చూపిందెవ‌రో తెలుసా..?

అయితే.. తాజాగా ఉన్న‌ట్టుండి ఓ వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఆ వీడియోలో ప‌వ‌న్‌, అలీ న‌వ్వుతూ మాట్లాడుకుంటున్నారు. అలీ భుజం మీద చెయ్యి వేసిన ప‌వ‌న్ అలీ చెప్పేది వంగి మ‌రీ విన్నారు. దీంతో.. చూస్తున్న‌వారు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోన‌య్యారు.

Also Read: సారీ చెప్పినా వ‌ద‌ల్లేదుగా.. ఎన్ కౌంట‌ర్ చేసిన అనసూయ‌!

వీళ్లిద్ద‌రూ ఎక్క‌డ క‌లిశారు? అంటూ ఆరాతీయ‌డం మొద‌లు పెట్టారు. అయితే.. వీళ్లిద్ద‌రూ అలీ బంధువుల వివాహ కార్య‌క్ర‌మంలో క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రూ క‌లిసి కాసేపు మాట్లాడుకున్నారు. అనంత‌రం అలీ స‌తీమ‌ణి జుబేదా ప‌వ‌న్‌, అలీతో క‌లిసి ఓ సెల్ఫీ తీసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

అనంత‌రం ఆ ఫొటోలు, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు జుబేదా. ఇప్పుడు ఈ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాదాపు మూడేళ్ల త‌ర్వాత ప‌వ‌న్, అలీ క‌లిసి క‌నిపించ‌డంతో నెటిజ‌న్ల‌తోపాటు ఫ్యాన్ కూడా ఫిదా అవుతున్నారు.

https://www.instagram.com/p/CLf3mtmAw-j/?utm_source=ig_web_copy_link

Back to top button