టాలీవుడ్సినిమా

పవన్ – హరీష్ సినిమా కథ లీక్.. డబుల్ కిక్ గ్యారంటీ !

Pawan Kalyan Harish Shankar Movie
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ సినిమా కథ గురించి గత కొన్ని నెలలుగా అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఓ న్యూస్ మళ్ళీ వైరల్ అవుతుంది. ఇప్పటికే హరీష్ శంకర్ ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ ను పూర్తి చేశాడని, ఈ సినిమాలో పవన్ ప్లాష్ బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడట. ప్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్రలోనూ.. అలాగే లైవ్ లో వచ్చే కొడుకు పాత్రలోనూ పవన్ రెండు పాత్రల్లో కనిపిస్తాడట. కాగా తండ్రి పాత్రది పోలీస్ ఆఫీసర్ పాత్ర అట.

అయితే తన తండ్రి మరణానికి కారణం అయిన వాళ్ల పై హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనే కోణంలో కథ సాగుతుంది. కథ పాతది అయినా, కథనం కొత్తగా ఉంటుందట. ఇక గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా సృష్టించిన రికార్డ్స్ పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్స్ గా నిలిచాయి. మరి ఈ సారి వీరి కలయికలో రాబోతున్న సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తోందో చూడాలి.

పవన్ మాత్రం ఈ సినిమాలో ఫుల్ మాస్ లుక్‌ లో దర్శనమిస్తాడట. ఇంతకు ముందెన్నడూ కనిపించని లుక్ లో అలాగే డిఫరెంట్ క్యారెక్టర్ లో ఈ సారి పవన్ నటించబోతున్నాడు. ఎంతైనా పవన్ కళ్యాణ్ సినిమా అంటే వందల కోట్ల వ్యాపారం. పైగా ఈ సినిమా గానీ హిట్టైతే ఇక ఆ నిర్మాతకు కాసుల వర్షం కురుస్తోంది. అందుకే హరీష్ శంకర్, పవన్ తో చేయబోతున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

కేవలం కథను ఫైనల్ చేసుకోవడానికే హరీష్ శంకర్ దాదాపు ఏడాది నుండి నలుగురు రైటర్స్ తో కూర్చుని సినిమాని సెట్ చేసుకుంటున్నాడు. అన్ని విధాలా ఖచ్చితంగా కథ బాగుందని తన టీమ్ లోని మిగిలిన వారందరికీ అనిపిస్తేనే ముందుకు వెళ్తున్నాడు. మొత్తానికి ఎలాగైనా ఈ సారి కూడా పవన్ తో భారీ హిట్ కొట్టాలనే సెన్స్ లో హరీష్ శంకర్ ఉన్నాడు. మరి చూద్దాం హిట్ కొడతాడో లేదో.

Back to top button