టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

పవన్ ‘మల్టీ స్టారర్’కి కొత్త సమస్య !

ayyappanum koshiyum telugu remake‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ – రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్’కి ప్రసుతం కొత్త సమస్య వచ్చి పడింది. ఈ సినిమాకి కెమెరామెన్ గా పని చేయాల్సిన ప్రసాద్ మూరెళ్ళ ఈ సినిమా నుండి తప్పుకున్నారు. కారణం, ఇగో అని తెలుస్తోంది. హీరో పవన్ కళ్యాణ్ తో, నిర్మాత నాగవంశీతో ఓ సమస్య వచ్చింది అట.

ఆ సమస్య కారణంగా పుట్టిన అహం కారణంగా ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు కెమెరామెన్ స్థానంలో రవి కే చంద్రన్ వస్తున్నాడు. ప్రసాద్ మూరెళ్ళకి త్రివిక్రమ్ మంచి సన్నిహితుడు. త్రివిక్రమ్ మధ్యలో రాజీ కుదర్చాలని ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు. మొత్తానికి కెమెరామెన్ మారిపోయాడు. ఇక వచ్చే వారం నుండి ఈ సినిమా కొత్త షెడ్యూలు స్టార్ట్ కానుంది.

మలయాళంలో మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాత్రను పెంచబోతున్నారు. ఈ పాత్రను పెంచడంతో పాటు రానా చేస్తున్న రెండో పాత్ర ఇంపార్టెన్స్ ను కూడా తగ్గిస్తున్నారని టాక్.

అయితే, అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాలో ఉన్న రెండు బలమైన పాత్రలలోని ఆ టెంపో తగ్గితే.. కథలో పట్టు తగ్గుతుంది. అప్పుడు ఆ కథకు ఉన్న బ్యూటీ పోతుంది. మరి ఇవన్నీ మేకర్స్ ఆలోచించుకుని మార్పులు చేస్తే బెటర్. దర్శకుడు అయితే పవర్ స్టార్ రేంజ్ కి తగ్గట్లు సినిమా ఉంటుందని చెబుతున్నాడు.

Back to top button