అత్యంత ప్రజాదరణఆంధ్రప్రదేశ్గెస్ట్ కాలమ్రాజకీయాలు

బీజేపీ బౌలింగ్: చంద్రబాబు ఔట్.. పవన్ బ్యాటింగ్!

Pawan kalyan Amit Shah

అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్లు.. లాగా ఉంది పవన్ పరిస్థితి.. బీజేపీ భాగస్వామ్య పక్షంగా చేరి.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న పవన్ కు అంత ఈజీ కాదని అర్థమవుతోందట… సీట్లు పంపకాలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాల్లో ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోకుండా బీజేపీ నీడలో మెలగాల్సిన పరిస్థితి జనసేనానికి వచ్చిందంట… జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ ఒంటరి పోటీకి ధైర్యం చేయలేక, కమలనాథుల వెంట పయనిస్తున్నారు.

Also Read: జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది?

పేరుకే సొంత పార్టీ అయినప్పటికీ.. బీజేపీ నేతల కబంధహస్తాల్లో చిక్కుకుపోయి అంతా కాషాయ నేతలకే వదిలేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ ఎ‍న్నికల్లో పోటీ చేస్తామని తొలుత ప్రకటించిన పవన్‌.. మూడు రోజులకే మాటమార్చారు. జనసేన ప్రకటనతో రంగంలోకి దిగిన బీజేపీ నేతలు.. జీహెచ్‌ఎంసీ బరిలో నుంచి పవన్‌ను తప్పించారు. వెంటనే బీజేపీ అభ్యర్థులకు మద్దతును సైతం ప్రకటించారు. ఈ పరిణామం జనసైనికుల ఆగ్రహాం, అసంతృప్తి, నిరాశకు దారితీసింది.

తిరుపతి ఉప ఎన్నిక వైసీపీ జాతకాన్ని తేల్చుతుంది అని అంతా అనుకుంటారు. కానీ బీజేపీ, జనసేన మిత్రత్వానికి కూడా అది అగ్ని పరీక్ష పెడుతుందని ఇపుడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ని సంప్రదించారో లేదో కానీ తిరుపతి నుంచి తాము పోటీ చేస్తామని బీజేపీ పెద్దలు చెప్పుకున్నారు. ఉప ఎన్నికల సన్నాహాక మీటింగు కూడా తిరుపతిలో తాజాగా పెట్టి మరీ హుషార్ చేశారు. మరి ఏపీ రాజకీయాల వరకూ చూసుకుంటే ఆరు శాతం ఓట్లున్న పవన్ వంటి మిత్రుడితో కలసి బరిలోకి దిగాలనుకున్నపుడు కనీసం చెప్పాల్సింది కదా. కానీ అలా జరగకపోవడం వల్లనే తిరుపతి నుంచి తానూ పోటీకి సై అని జనసేన అంటోందట. మొత్తానికి బీజేపీ పెద్దన్న వైఖరికి తమ్ముడు చిన్నబుచ్చుకుంటున్నాడు అంటున్నారు.

Also Read: బీహార్ ఎన్నికలు గుణపాఠం కానున్నాయా..?

దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఊపు మీద ఉన్న కమలనాథులు తిరుపతి సీటును వదులుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. అయితే గత లోక్‌సభ ఎ‍న్నికల్లో బీజేపీ అభ్యర్థికి కేవలం 16 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. సామాజిక సమీకరణాలు, పవన్‌ ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని సీటును తమకే కేటాయించాలని జనసేన డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు తిరుపతి విజయం తమదేనని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపని జనసేనకు తిరుపతి సీటు కేటాయిస్తే నిండా మునిగిపోతామని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల మాదిరిగానే తిరుపతిలోనూ జనసేన సైనికులు బీజేపీ నీడలోనే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్‌ ప్రతిపాదనను బీజేపీ పెద్దలు సైతం పక్కనపెట్టే అవకాశం ఉంది. దీనిపై నేటీ భేటీ అనంతరం స్పష్టత రానుంది.

బీజేపీ రాజకీయం తలపండిన చంద్రబాబుకే ఇప్పటికీ అర్ధం కావడంలేదు. ఇక రాజకీయాల్లో కొత్త పూజారి అయిన జనసేనాని పవన్ కల్యాణ్ ఎలా అర్ధం చేసుకోగలరు, తెల్లనివి అన్నీ పాలు, నల్లనివి నీళ్ళు అనుకునే సగటు ఓటరు మనస్తత్వం కలిగిన పవన్ రాజకీయాల్లో అందుకే సరిగ్గా రాణించలేకపోతున్నారన్న చర్చ సాగుతోంది. పైగా ఇక్కడ ఎప్పటికపుడు స్టాండ్ మార్చుకోవాలి. విధేయతలు, మర్యాదలు ఏ రోజుకు ఆ రోజుకు మారిపోతుంటాయి. ఎప్పటి లెక్కలు అపుడే సరిచూసుకోవాలి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Back to top button