అప్పటి ముచ్చట్లుటాలీవుడ్సినిమాసినిమా వార్తలు

లాస్ట్ మినిట్ లో పవన్ కళ్యాణ్ నచ్చలేదనేశాడు !

Snehituluముత్యాల సుబ్బయ్యగారు ‘పవిత్ర ప్రేమ’ సినిమా తీస్తోన్న రోజులు అవి. ఆ సినిమా పూర్తయిన తర్వాత, తన కొత్త సినిమా కోసం కథాచర్చలు ప్రారంభిస్తూ.. ఎలాగైనా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ గారికి శీనయ్య అనే నిర్మాతతో అడ్వాన్స్‌ కూడా ఇప్పించారు. ఇక కథను ఫైనల్ చేసుకునే క్రమంలో చాలా కథలు విన్న తర్వాత, ఓ కథను ఓకే చేశారు.

ఆ కథ ఇద్దరికీ బాగా నచ్చింది. అలాగే పవన్‌ కల్యాణ్‌ కు కూడా నచ్చుతుందని భావించి, ఆ కథ రాసిన రచయితకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. పైగా ఆ కథకి తగ్గట్టు మ్యూజిక్ కూడా చేయించారు. అంతా చేయించిన తరువాత, షూటింగ్ కి వెళ్లే టైంలో లాస్ట్ మినిట్ లో పవన్ కళ్యాణ్ కథ విన్నాడు. కథ నచ్చలేదనేశారు. మరో కథ చూడండని షూటింగ్ కి బ్రేక్ ఇచ్చేశారు. దాంతో ముత్యాల సుబ్బయ్య బాగా నిరాశకు గురయ్యారు.

పైకి పవన్ తో ‘ఫరవాలేదు సార్‌.. మరో కథ చూద్దాం’ అని చెప్పి బయటకు వచ్చేసినా ఆయన దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అలాగే నిర్మాత శీనయ్య కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయానికి బాగా ఫీలయ్యాడు. ఎందుకంటే వీరిద్దరికీ ఆ కథ బాగా నచ్చేసింది. ఎలాగైనా ఆ కథతోనే సినిమా తీయాలని ఇద్దరూ ఫిక్స్‌ అయ్యారు. మరోపక్క ముత్యాల సుబ్బయ్యగారిని శీనయ్య ఒత్తిడి చేశారు.

‘ఎలాగైనా సరే.. ఈ కథతోనే మనం సినిమా చేసి తీరాలి. నువ్వు మళ్లీ బిజీ అయిపోతే, మన కలయికలో సినిమా రాదు, నాకు నువ్వు మళ్ళీ దొరకవు, కాబట్టి పవన్ కళ్యాణ్ ప్లేస్ లో ఇంకో హీరోని అయినా పెట్టుకుని సినిమా చేసేద్దాం అని’ అని పట్టుపట్డాడు. దాంతో ముత్యాల సుబ్బయ్యగారు హీరో కోసం అన్వేషణ మొదలుపెట్టారు.

ఆ సమయంలో పెద్ద హీరోలు ఖాళీగా లేరు. చిన్న హీరోల్లో ‘వడ్డే నవీన్‌’ ఖాళీగా ఉన్నాడని తెలిసి, అతనితో సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు. అలా ‘స్నేహితులు’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా వంద రోజులు ఆడింది. పవన్ కళ్యాణ్ కి ఒక మంచి సినిమా మిస్ అయిపోయింది.

Back to top button