టాలీవుడ్సినిమా

కుస్తీ వీరుల‌తో బ‌స్తీమే స‌వాల్‌.. మ‌ట్టి క‌రిపించిన ప‌వ‌ర్ స్టార్‌..!

Pawan Krish Movie
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ – ద‌ర్శ‌కుడు క్రిష్ కాంబోలో రాబోతున్న హిస్టారికల్ మూవీ.. ఫ్యాన్స్ లో హై ఓల్టేజ్ క్యూరియాసిటీని ఫిల్ చేస్తోంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ గెట్ పై, సినిమా టైటిల్ పై వ‌స్తున్న రూమ‌ర్స్‌ ఎంతో ఆస‌క్తిని రేకెత్తిస్తుండ‌గా.. తాజాగా కండ‌లు తిరిగిన మ‌ల్ల‌యోధుల‌తో ప‌వ‌ర్ స్టార్ త‌ల‌ప‌డ‌బోతున్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో కూడా సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

ప‌వ‌న్ రీ-ఎంట్రీ త‌ర్వాత అనౌన్స్ చేసిన నాలుగు సినిమాల్లో అత్యంత క్యూరియాసిటీని రేకెత్తిస్తున్న సినిమా ఇదే కావ‌డం విశేషం. 15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. ప్ర‌తీ విష‌యం ప్ర‌త్యేకంగా నిలుస్తోంది.

ఈ పీరియాడికల్ డ్రామాలో.. పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ అనే టైటిల్ పరిశీలిస్తున్న విషయం కూడా తెలిసిందే. అంతేకాదు.. పవన్ గెటప్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న క్రిష్‌.. అద్భుత‌మైన రూపాన్ని ఫైన‌ల్ చేశాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ కూడా రిలీజ్ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. పవన్ కెరీర్ లోనే హ‌య్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిల‌వ‌బోతున్న ఈ మూవీని.. దాదాపు 170 కోట్ల రూపాయల వ్య‌యంతో తెర‌కెక్కించ‌బోతున్నార‌ట‌.

Also Read: ఉప్పెన టీం సభ్యులకు సర్ ప్రైజ్ ఇచ్చిన చిరంజీవి

చారిత్ర‌క ప‌రిస్థితుల‌ను క‌ళ్ల‌కు క‌ట్టేందుకు చార్మినార్ తోపాటు గండికోట సంస్థానం సెట్ ను కూడా నిర్మిస్తున్నారు. కాగా.. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ న‌డుస్తోంది. ప‌వ‌న్ ప‌ది రోజులు డేట్స్ కేటాయించ‌డంతో.. ఈ షెడ్యూల్లో కీల‌క స‌న్నివేశాలు పూర్తిచేయబోతున్నాడు క్రిష్‌. ఇందులో భాగంగా.. భారీ దేహాలు క‌లిగిన మ‌ల్ల‌యోధుల‌తో వీరోచిత పోరాటాన్ని షూట్ చేయ‌బోతున్న‌డు ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ఆ ప‌హిల్వాన్ల‌తో క‌లిసి ప‌వ‌న్ క‌ల్యాణ్ దిగిన ఫొటో సోస‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also Read: శంకర్ -రాంచరణ్ సినిమాలో పవన్ ప్లేసులో కోలివుడ్ స్టార్

పాన్ ఇండియా లెవ‌ల్లో రూపొందించ‌బోతున్న ఈ సినిమాలోకి ఇత‌ర భాష‌ల‌కు చెందిన యాక్ట‌ర్స్ ను కూడా తీసుకోబోతున్నాడు క్రిష్‌. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న.. నిధి అగర్వాల్, బాలీవుడ్ భామ‌ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ న‌టిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. వ‌చ్చే సంక్రాంతికి ఈ సినిమాను బరిలో నిలపాలని యోచిస్తోంది యూనిట్.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button