అత్యంత ప్రజాదరణఆంధ్రప్రదేశ్రాజకీయాలు

పవన్ దూకుడు పాలిటిక్స్ కి బ్రేక్?

Pawan kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో దూకుడు పాలిటిక్స్ మంచిది కాదన్న ఆలోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అందుకే మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లుల వ్యవహారంలో గవర్నర్ నిర్ణయం తరువాత స్పందించడమే మంచిదని కొందరి సలహా మేరకు పవన్ గమ్మున ఉన్నట్లు చెబుతున్నారు. రాజధాని ఎక్కడికి తరలిపోదని గతంలో పవన్ రైతులకు హామీ ఇచ్చారు. తాను మూడు రాజధానుల అంశంపైనే విభేదిస్తూ బిజెపి తో పొత్తు సైతం పెట్టుకున్నట్లు ఒక సందర్భంలో పేర్కొన్నారు.అయితే ఆయన జట్టు కట్టిన కమలం గవర్నర్ ను ఈ బిల్లులు ఆమోదించకండి అని లేఖ రాసినా కూడా జనసేనాని ఉలుకు పలుకు లేకపోవడం తో అందరిలో ఆసక్తి పెరుగుతుంది. తాను పొత్తు పెట్టుకున్న బీజేపీలోనే అమరావతి రాజధానిపై రెండు వర్గాలుగా విడిపోయి ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో రాజధాని అంశం తాను ఎందుకు ప్రస్తావించాలన్నది పవన్ కళ్యాణ్ అభిప్రాయంగా అనిపిస్తుంది. గవర్నర్ నిర్ణయం తర్వాతనే పవన్ కల్యాణ్ రాజధాని అంశంపై ప్రస్తావించే అవకాశముంది.నిజానికి ఇప్పుడు పొలిటికల్ ఫీల్డ్ లో ప్రధాన యుద్ధం మూడు రాజధానుల అంశమే. దీనిపై టిడిపి, బిజెపి, కమ్యూనిస్ట్ లు అంతా ఒక్కటై అమరావతి ని ముక్కలు చేసేందుకు ససేమిరా అంటున్నాయి.

అయితే రాజధానిని ముక్కలు చేసేందుకు అస్సలు ఒప్పుకునేది లేదని ఒకనాడు రైతుల ఉద్యమానికి బాసటగా నిలిచిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మౌన ముద్ర లో ఉన్నారు. కనీసం ట్విట్టర్ వేదికగా అయినా ఆయన స్పందించకపోవడం పోవడం ఎపి లో చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ వద్దకు చేరిన కీలక బిల్లుల సమయంలో ఎందుకు ఆయన మాట్లాడటం లేదన్న సందేహాలు పెల్లుబికుతున్నాయి.సొంత రాజకీయ అజెండాను అమలు చేసుకునే ఉద్దేశ్యం తోటే పవన్ కళ్యాణ్ ఇంతటి ముఖ్యమైన అంశం విషయంలో మూగనోము పట్టారన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

Tags
Show More
Back to top button
Close
Close