టాలీవుడ్సినిమా

వకీల్ సాబ్ షూటింగ్ డేట్ ఫిక్స్ !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా అక్టోబర్ 23న నుండి మొదలుపెట్టి డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని దాదాపు 20 రోజుల డేట్స్ ను పవన్ కేటాయించాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో వకీల్ సాబ్ కోసం వేసిన ప్రత్యేక భారీ కోర్టు సెట్ లో ఇరవై రోజుల పాటు షూట్ చేయనున్నారు. అలాగే ఇక మిగిలిన షూటింగ్ మొత్తం ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం వేస్తోన్న కొత్త సెట్స్ లోనే పూర్తి చేయనున్నారని సమాచారం. నిజానికి ఈ సినిమా మధ్యలో అగకపోయి ఉంటే ఎప్పుడో జూన్ లోనే రిలీజ్ అయి ఉండేది. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు మధ్యలోనే ఆగి.. దాదాపు రెండు సంవత్సరాలు ఆలస్యం అయింది ఈ సినిమా.

Also Read: స్కామ్-1992: ఇండియాలో టాప్ వెబ్ సిరీస్.. ప్రత్యేకతేంటీ?

అయితే ఇప్పుడు షూట్ చేయడం పవన్ కు ఇష్టం లేకపోయినా.. దిల్ రాజు కోరిక మేరకు పవన్ షూట్ కి ఒప్పుకున్నాడు. ఎలాగూ థియేటర్స్ ఓపెన్ అవుతోన్న క్రమంలో మేకర్స్ అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు కాబట్టి, మనం కూడా షూట్ స్టార్ట్ చేద్దాం అంటూ మొత్తానికి దిల్ రాజు, పవన్ షూట్ లో పాల్గొంటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా బాగానే మ్యానేజ్ చేశాడు. పవర్ స్టార్ కూడా అటు రాజకీయాలతో పాటు సినిమాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ వరుసగా సినిమాలను అంగీకరిస్తూ ముందుకువెళ్తున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ షూట్ ను నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరిపి సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేయాలనుకుంటున్నా.. ఆ తరువాత వెంటనే క్రిష్ తో చేస్తోన్న సినిమాను కూడా మొదలుపెడతాడట.

Also Read: ‘రాధేశ్యామ్’ టీమ్ పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

క్రిష్ – పవన్ సినిమాను వచ్చే విజయదశమి పండుగ కానుకగా రిలీజ్ చేసే అవకాశాలున్నాయట. క్రిష్ ఈ సినిమాని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడని.. పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారని.. అలాగే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇప్పటి వరకు ఇలాంటి సినిమాను పవన్ చేయలేదని.. మొత్తానికి ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా నిలిచిపోతుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా తీసుకురానున్నారు. అందుకే గ్రాండ్ నెస్ ను తీసుకు వచ్చేందుకు పరభాషా నటులను కూడా క్రిష్ ఈ సినిమా కోసం ఎంచుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

Back to top button