టాలీవుడ్సినిమా

పల్లెటూరి పిల్లగా పాయల్ పాప !

హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ సినిమాల్లో ఎంత ఘాటుగా కనిపిస్తుందో సోషల్ మీడియాలో అంతకు పదింతలు ఘటుగా కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ బ్యూటీ ఈ మధ్య హైద్రాబాద్‌కు మకాం మార్చేసింది. తెలుగు సినిమాలు చేతినిండా ఉండటంతో హైద్రాబాద్‌ లో ఒక ప్లాట్ కూడా కొనుక్కుంది. తాజాగా పాయల్ తన మేకప్ రూంలోని సంగతులను చూపించింది. ప్రస్తుతం ఓ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొన్న పాయల్.. పక్కా తెలుగమ్మాయిలా, పల్లెటూరి పిల్ల గెటప్ లో దర్శనం ఇచ్చింది. ఆ మధ్య పల్లెటూరి పిల్లగా కనిపించిన పాయల్ కి సంబంధించిన స్టిల్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి.

Also Read: విశాఖకు నో.. హైదరాబాద్ కే జై.. ‘మెగా’ స్టూడియోకు చిరంజీవి శ్రీకారం?

కాగా తాజాగా మేకప్ రూంలో రెడీ అవుతున్న వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో జడ నిండా పూలు పెట్టుకుని కనిపించడం, పైగా ఎలా కనిపిస్తున్నానని అంటూ అందర్నీ అడుగుతూ తెగ మురిసిపోయింది. పూలు ఎందుకు పెట్టుకున్నావ్ అంటే.. సౌత్ ఇండియన్ కల్చర్.. తెలుగమ్మాయిలా మారిపోయాను అంటూ ముసిముసి నవ్వులు కూడా చిందించింది. ఏమైనా ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో ఆడదానిలో ఎంత కసి ఉంటుందో చాల సహజంగా తన నటనలో చూపించి కుర్రాళ్ళకు ఫేవరేట్ హాట్ బ్యూటీగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత అనుకున్న స్థాయిలో పెద్దగా రాణించలేకపోయింది.

Also Read: వైరల్: పెళ్లి తర్వాత తొలి ఫొటో.. రానా-మిహీక హనీమూనా?

నిజానికి ‘పాయల్ రాజ్‌పుత్’ ఆ తరువాత చేసిన సినిమాల్లో కూడా అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనకాడకుండా తనకున్న యావత్తు సౌదర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చినా ఆమె కెరీర్ మాత్రం పీక్ లోకి వెళ్ళలేదు. మధ్యలో పెద్ద సినిమాల్లో పాయల్ పాపకు కొన్ని అవకాశలు వచ్చినా రెమ్యునరేషన్ విషయంలో డిమాండ్ కు పోయి వచ్చిన సినిమాలను కూడా మిస్ చేసుకుంది. అంతలో పాయల్ కి ప్లాప్స్ వచ్చాయి. ఈ లోపు రెండేళ్లు పూర్తయిపోయాయి. స్టార్ హీరోయిన్ గా వెలిగిపోదామనుకుని చివరికీ ఐటెమ్ సాంగ్స్ కి కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. పాపం పాయల్.

Back to top button