సినిమా వార్తలు

మళ్ళీ బెడ్ రూమ్ సీన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది !

Payal
సినిమా ఇండస్ట్రీలోని పోటీని తట్టుకుని నిలబడటం అంటే.. ఆ నిలబడిన వ్యక్తిలో సినిమా పట్ల ఎంతో తపన, మరెంతో అంకితభావం అన్నా ఉండాలి, లేదా గ్లామర్ పరంగా అదృష్టం అయినా కలిసి రావాలి. బోల్డ్ పాప పాయల్ రాజ్ పుత్ విషయంలో జరిగింది ఇదే. నిజానికి ‘ఆర్ ఎక్స్ 100’ అనే సినిమాలో మొదట హీరోయిన్ వేరు. ఆమె డిమాండ్స్ దెబ్బకు భయపడిన ఆ సినిమా నిర్మాతలు ఆ హీరోయిన్ని తప్పించి.. పాయల్ ను తీసుకున్నారు.

లుక్స్ పరంగా, ఫిజిక్ పరంగా పాయల్ ఎంతైనా డిమాండ్ చెయ్యొచ్చు. కానీ సినిమా కథ నచ్చి.. నిర్మాతలు ఇచ్చినంత తీసుకుని ఆ సినిమా చేసింది. అలా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ బాటలో.. గ్లామర్ హీరోయిన్ గా తనకంటూ ఓ ఇమేజ్ తో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. కుర్రకారు హృదయాల్లో సుస్థిర స్తానం సంపాదించుకుంది. అయితే ఆ తరువాత ఈ అమ్మడు ఎన్ని సినిమాలు చేసినా బాక్సాఫీస్ వద్ద బకెట్లు తన్నేస్తున్నాయి.

మరోపక్క మంచి పాత్రల్లో తనకు నటించే స్కోప్ ఉన్న పాత్రలు రాకపోగా.. ప్రతి సినిమాలో బోల్డ్ రోల్స్, వ్యాంప్ రోల్స్ మాత్రమే వస్తున్నాయట. కెరీర్ మొత్తం కేవలం ఘాటు రొమాంటిక్ సీన్స్, స్కిన్ షోతోనే బండిని నడిపించడం తన వల్ల కాదు అంటూ మొత్తానికి ఇక నుండి శృంగారపరమైన సన్నివేశాల్లో రెచ్చిపోయే పాత్రలకు దూరం అని ఫిక్స్ అయింది పాయల్. ఈ విషయాన్ని గతంలో పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పింది.

కానీ పాయల్ రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ కి సంబంధించిన కథను వింది అట. అయితే, ఆ కథ నిండా బెడ్ రూమ్ సీన్స్, రొమాంటిక్ సాంగ్స్ మాత్రమే ఉన్నా.. క్లైమాక్స్ అదిరిపోయిందని.. అందుకే పాయల్ ఆ వెబ్ సిరీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. మొత్తానికి పాయల్ రాజపుత్ నుండి హాట్ సీన్స్ చూడాలనుకున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. కనీసం ఈ వెబ్ సిరీస్ తోనైనా పాయల్ కు ఇక నుండైనా మంచి ఛాన్సులు వస్తాయేమో చూడాలి.

Back to top button