వ్యాపారము

గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తే రూ.2700 క్యాష్‌బ్యాక్‌.. ఎలా పొందాలంటే..?

మన దేశంలోని ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫాంలలో ఒకటైన పేటీఎం గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ కు సంబంధించి అద్భుతమైన క్యాష్ బ్యాక్ తో పాటు రివార్డులను ప్రకటించింది. పేటీఎం కొత్త వినియోగదారులు గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేయడం ద్వారా మూడుసార్లు 2700 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం అయితే ఉంటుంది.

మూడుసార్లు గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేస్తే నెలకు 900 రూపాయల చొప్పున మూడు నెలలు 2,700 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవడం ద్వారా రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు కూడా పొందే అవకాశం అయితే ఉంటుందని సమాచారం. పేటిఎమ్ నౌ పే లేటర్ ప్రోగ్రామ్‌ ఆప్షన్ ద్వారా వినియోగదారులు ఈ క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది.

పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవాలని అనుకునే వాళ్లు గ్యాస్ సిలిండర్ ఆప్షన్‌లోకి వెళ్లి గ్యాస్ ప్రొవైడర్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొబైల్ నంబర్ తో పాటు ఎల్‌పిజి ఐడి, వినియోగదారు నెంబరు ఎంటర్ చేసి పేటీఎం వాలెట్, ఇతర మోడ్‌ల ద్వారా చెల్లింపులు జరిపే అవకాశం ఉంటుంది. హెచ్‌పీ గ్యాస్‌ కంపెనీతో కలిసి పేటీఎం గతేడాది ఈ సిలిండర్ బుకింగ్ సదుపాయాన్ని కల్పించింది.

ఆ తరువాత పేటీఎం ఇండేన్, భారత్ గ్యాస్‌ భాగస్వామ్యంతో సిలిండర్ బుకింగ్ ను ప్రారంభించడం గమనార్హం. పేటీఎం కస్టమర్లకు వినూత్న ఫీచర్లను అందించడం ద్వారా సేవలను మరింత మెరుగుపరుస్తోంది.

Back to top button