అత్యంత ప్రజాదరణప్రత్యేకం

పేటీఎం కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. అందుబాటులోకి ఈఎంఐ సేవలు..!


ఈ మధ్య కాలంలో డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు యూజర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా కొత్త నిర్ణయాలను తీసుకుంటూ ఆ నిర్ణయాలను అమలులోకి తెస్తున్నాయి. తాజాగా పేటీఎం సంస్థ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కస్టమర్ల కోసం కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. పేటీఎం పోస్ట్‌పెయిడ్ యూజర్లు తమ నెలవారీ బిల్లులను ఈఎంఐ రూపంలోకి మార్చుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది.

ఈ సర్వీసులను వినియోగించుకోవాలనే కస్టమర్ల కోసం బిల్ ఈఎంఐ అనే కొత్త ఫీచర్ ను పేటీఎం అందుబాటులోకి తెచ్చింది. పేటీఎం కస్టమర్లు తక్కువ వడ్డీతోనే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చని కంపెనీ చెబుతోంది. పేటీఎం యాప్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లు సాధారణంగా బిల్లు జనరేట్ అయిన తరువాత 7 రోజుల్లోగా ఆ బిల్లును చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏదైనా కారణాల వల్ల బిల్లు చెల్లించలేని వారి కోసం పేటీఎం కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.

ఇకపై కస్టమర్లు బిల్లును నెలవారీ ఈఎంఐలోకి మార్చుకునే అవకాశం ఉంటుంది. పేటీఎం పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు సంస్థ లక్ష రూపాయల వరకు క్రెడిట్ లిమిట్ ను అందిస్తోంది. ఈ క్రెడిట్ లిమిట్ ద్వారా షాపింగ్ చేసి నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు మరింత చేరువయ్యేందుకు పేటీఎం సంస్థ ప్రయత్నిస్తోంది.

పేటీఎం యాప్ ఉపయోగించే కస్టమర్లకు పోస్ట్ పెయిడ్ లో వేరు వేరు రకాల సర్వీసులను పేటీఎం సంస్థ అందుబాటులోకి తెచ్చింది. క్రెడిట్ స్కోర్ లేకపోయినా పోస్ట్ పెయిడ్ లైట్ యూజర్లు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. పోస్ట్ పెయిడ్ లైట్ యూజర్లకు రూ.20,000 వరకు డిలైట్ అండ్ ఎలైట్ కస్టమర్లకు లక్ష రూపాయల వరకు క్రెడిట్ లిమిట్ పొందే అవకాశాన్ని పేటీఎం సంస్థ కల్పిస్తోంది.

Back to top button