ఆరోగ్యం/జీవనంకరోనా వైరస్

కరోనా వైరస్ సోకిందా.. చేయకూడని తప్పులు ఇవే..?

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా సోకిన వారిలో చాలామంది హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. తక్కువ వయస్సు ఉన్నవారికి ఏ సమస్యలు లేకపోయినా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లకు కరోనా సోకితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోంది. కరోనా సోకి జ్వరం తగ్గకపోయినా, దగ్గు పెరిగినా వెంటనే ఆస్పత్రిలో చేరితే మంచిది.

కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా వెంటనే చికిత్స చేయించుకుంటే మంచిది. కొంతమందికి యాంటీజెన్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ రావడం గమనార్హం. కరోనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ ను జయించడం సాధ్యమవుతుంది. వెంటిలేటర్ పై చికిత్స పొందే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

కరోనా సెకండ్ వేవ్ లో చాలామందిలో జ్వరం ప్రధాన లక్షణంగా కనిపిస్తోంది. జ్వరం, దగ్గు పెరిగిన తర్వాత వైద్యుడిని కరోనా రోగులు సంప్రదిస్తుండగా అప్పటికే పరిస్థితి తీవ్రమవుతోంది. కరోనా సోకిన వాళ్లలో శ్వాసకోశ సమస్యలు తీవ్రమవుతూ ఉండటం గమనార్హం. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తెలియకపోవడం వల్ల కూడా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.

కరోనా లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఏ కరోనా లక్షణాన్ని విస్మరించవద్దని ఆక్సిజన్ లెవెల్స్ 94 శాతం కంటే తగ్గుతుంటే పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.

Back to top button