తెలంగాణరాజకీయాలు

కేసీఆర్ కు ఏమైందో చెప్పాలని హైకోర్టులో పిటిషన్


రాష్ట్రంలో కరోనా మహ్మమరి విజృంభిస్తున్న వేళ సీఎం కేసీఆర్ ఎక్కడ? అనే చర్చ నడుస్తోంది. వారం రోజులుగా తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు వెయ్యికిపైగా నమోదవుతున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఈ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం జరిగినా ప్రభుత్వం చివరినిమిషంలో వాయిదా వేసుకుందని తెలుస్తోంది. కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్ లాక్ 2.0నే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఏపీలో వారి దాహం తీరనిది.!

అయితే లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం భాగ్యనగరంలో జోరుగా జరుగడంతో ఇతర ప్రాంతాలకు చెందినవాళ్లంతా సొంతూళ్లకు పయమనయ్యారు. దీంతో నగరంలోని రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 20నుంచి 30లక్షల మంది వరకు తమ సొంతూళ్లకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో నగరంలో ఎక్కడ చూసిన టూలెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. నగరంలో అన్ని పనులను పర్యవేక్షించే జీహెచ్ఎంసీ కార్యాయలంతోపాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాయాల్లోని సిబ్బందికి కరోనా సోకడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులు, సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వహించాల్సి వస్తుందని వాపోతున్నారు.

ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో 30మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. దీంతో వీరినంతా హోంక్వారంటైన్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పలువురు ఆరా తీయడం మొదలెట్టారు. సీఎం కేసీఆర్ కు కూడా కరోనా సోకిందా? అందుకే బయటికి రావడం లేదా? అంటూ విపక్ష నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ కొద్దిరోజులుగా ఎర్రవెల్లిలోని ఫౌంహౌజ్ లో ప్రభుత్వానికి సంబంధించిన సమీక్షలు నిర్వహిస్తున్నారని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

జివికె రెడ్డి వ్యాపారాలపై సిబిఐ దాడుల వెనక అసలు ఉద్దేశం ?

సీఎం ఆరోగ్య పరిస్థితిపై తాజాగా హైకోర్టులో మాండమాస్ పిటిషన్ దాఖలైంది. సీఎం కేసీఆర్‌ దాదాపు ప‌ది రోజులుగా ప్ర‌జ‌ల‌కు క‌నిపించ‌డం లేద‌ని.. ప్ర‌స్తుతం ఆయన ఎక్కడున్నారు? ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాల‌ని కోరుతూ న‌వీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. పీవీ న‌రసింహారావు శ‌త‌జ‌యంతి రోజున ఆయ‌న చివ‌రిసారిగా ప్ర‌జ‌ల‌కు క‌నిపించార‌ని పేర్కొన్నారు. ఆ స‌భ‌లో కేసీఆర్ మాస్క్ కూడా ధ‌రించ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌ ఆరోగ్యంపై ఆందోళ‌న‌ చెందుతున్నట్టు చెప్పారు. ఆ తర్వాత నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో సీఎం మాస్కు లేకుండానే కనిపించారని పేర్కొన్నారు.

దీని తర్వాతే ప్రగతి భవన్లో 30మంది పాజిటివ్ రావడంతో ఆయన ఆరోగ్యంపై గందరగోళం నెలకొందని తెలిపాడు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ పౌరుడిగా ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నాడు. రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా సీఎం హోదాలో ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల్సి ఉందని తెలిపాడు. రాష్ట్ర ప్ర‌జ‌లు ఆందోళ‌న చెంద‌కుండా సీఎం కేసీఆర్ ఎక్కడ ఉన్నారో? ఆయన ఆరోగ్య ప‌రిస్థితిపై వివ‌రాలు అంద‌జేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని మల్లన్న పిటిష‌న్‌లో కోరాడు. ఇకనైనా ప్రభుత్వం ఇప్పటికైనా సీఎం ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇస్తుందో లేదో వేచిచూడాల్సిందే..!

Tags
Show More
Back to top button
Close
Close