జాతీయంరాజకీయాలు

పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు.. : బెంబేలెత్తుతున్న వాహనదారులు

Petrol price
పెట్రోల్‌ ధరలు వాహనదారులను రోజురోజుకూ బెంబేలెత్తిస్తున్నాయి. రోజూ ధరలు పెరగడమే తప్ప.. ఒక్క రోజు కూడా తగ్గిన దాఖలాలు లేవు. ఇప్పటికే కేంద్రంపై ప్రతిపక్షాలు ముప్పేటదాడి చేస్తున్నాయి. పెరిగిన ఇంధన ధలతో ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ.. కేంద్రం మాత్రం తన పనితాను చేసుకూ పోతోంది. ఎన్ని ఆందోళనలు చేసినా.. ధరలను తగ్గించేది లేదంటూ ఇంకా పెంచేస్తూనే ఉంది.

Also Read: హమ్మయ్యా.. హైదరాబాద్ కు బీజేపీ ఒకటి సాధించింది

లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 38 పైసల వరకు పెంచాయి. ఇటీవల దేశంలో ఇంధన ధరలు వరుసగా 12 రోజులు పెరిగిన విషయం తెలిసిందే. ఆ వరుస పెరుగుదలకు రెండు రోజులు విరామం ఇచ్చి.. మళ్లీ మంగళవారం ఇంధన ధరలు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్‌పై 35 పైసలు పెంచడంతో లీటర్ పెట్రోల ధర రూ. 90.93గా, డీజిల్ ధర రూ. 81.32గా నమోదైంది.

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.54, డీజిల్ ధర రూ. 88.69గా నమోదైంది. కాగా, 54 రోజుల్లో చుమురు ధరలు 25 సార్లు పెరగడం గమనార్హం. ఈ ఏడాదిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.7.50 పెరిగియి. ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలపై 37 పైసలు, 38 పైసలు పెరిగాయి. దీంతో దేశ ఆర్థిక రాజధానిలో పెట్రోల్ లీటర్ ధర రూ.97.34 కాగా, డీజిల్ ధర రూ.88.44గా ఉంది. ఇక బెంగళూరులో నగరంలో పెరిగిన ధరలతో పెట్రోల్ లీటర్ ధర రూ.93.98, డీజిల్ లీటర్ ధర రూ.86.21గా ఉంది.

Also Read: ఎన్నికల అక్రమాలు.. పోటెత్తిన ప్రజానీకం

ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండడంతో దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. ప్రజల జేబులను ఖాళీ చేయడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బాగా పనిచేస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే సెటైర్లు వేశారు. క్రూడాయిల్ ధరలు పెరగకున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఏంటని ప్రశ్నించారు. ఇక రాబర్ట్ వాద్రా సోమవారం తన కార్యాలయానికి సైకిల్‌పై వెళ్లి ఇంధన ధరల పెరుగుదలపై నిరసన తెలిపారు. సోనియా గాంధీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Back to top button