విద్య / ఉద్యోగాలు

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో 1110 ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో..?

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కేంద్ర విద్యుత్‌ శాఖకు చెందిన ఈ సంస్థ భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది, ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. నోటిఫికేషన్ ద్వారా 1110 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పీజీ డిప్లొమా, ఐటీఐ పాసైన వాళ్లు అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండా సంబంధిత కోర్సులో మార్కులను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆగష్టు 20 ఈ ఉద్యోగ ఖాళీలకు చివరి తేదీగా ఉంది. https://www.powergridindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

18 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 11,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు వేతనం పొందవచ్చు. సంబంధిత కోర్సులో మార్కులను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://www.powergridindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు పవర్ గ్రిడ్ లో 137 ఫీల్డ్‌ ఇంజినీర్లు, సూపర్‌వైజర్‌ పోస్టులు ఉన్నాయి. ఆగష్టు 27 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా 29 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Back to top button