క్రీడలుప్రత్యేకం

కివీస్ తో ఫైట్: టీమిండియాకు సవాళ్లివే..

Phyton with the Kiwis: Challenges for Teamindia ..

బలమైన న్యూజిలాండ్ తో భారత ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో తలపడుతోంది. భారత్ కంటే కూడా ఈ మ్యాచ్ లో కివీస్ బలంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి బలమైన జట్లను ఓడించిన టీమిండియా.. న్యూజిలాండ్ లో ఆ జట్టు చేతిలో 2-0 తేడాతో ఓడిపోయింది. కివీస్ పేస్ బౌలింగ్ కు కుప్పకూలింది.

ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ నెగ్గని కెప్టెన్ కోహ్లీ తన సారథ్యంలో ఎలాగైనా సరే ఈ కప్ గెలవాలని పట్టుదలగా ఉన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 3.30కు ప్రారంభయ్యే ఈ ఫైనల్ లో భారత్ , కివీస్ విజయావకాశాలు ఎలా ఉన్నాయనే దానిపై ఆసక్తి కర చర్చ సాగుతోంది.

ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్ వేదికగా ఈ ప్రపంచటెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతోంది. భారత్ సత్తా మేరకు ఆడితే కివీస్ కు గట్టి పోటీనివ్వగలదు. మరోవైపు ప్రత్యర్థి న్యూజిలాండ్ ఇప్పటికే ఇంగ్లండ్ ను ఇంగ్లండ్ లో 1-0తో ఓడించి టెస్ట్ సిరీస్ గెలిచి సమరోత్సాహంతో ఉంది. కివీస్ ను ఏమాత్రం తక్కువగా తీసుకోవడానికి వీల్లేదు.

బలంగా ఉన్నా కూడా భారత్ టాప్ ఆర్డర్ పైనే భారం ఉంది. వాళ్లు కుప్పకూలితే కష్టమే. ఇంగ్లండ్ లోని తేమ, ఫాస్ట్ బౌన్స్ స్వింగ్ పిచ్ లు భారత బ్యాట్స్ మెన్ కఠిన పరీక్షనే పెడుతున్నాయి. సెషన్ సెషన్ కు మారే వాతావరణమే టీమిండియ ఆటగాళ్లకు పరీక్ష పెడుతుంది.

ఇక న్యూజిలాండ్ దేశంలోని వాతావరణమే ఇంగ్లండ్ లోనూ ఉంటుంది కాబట్టి వారికి ఇక్కడి పిచ్ లు, సీమ్ కొట్టినపిండి. అందుకే కివీస్ బలంగా కనిపిస్తోంది. కివీస్ కు మంచి ఫాస్ట్ బౌలర్లు ఉండడం వారి బలాన్ని పెంచుతోంది. భారత కెప్టెన్ కోహ్లీ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. అందరూ రాణిస్తే భారత్ కు తిరుగు ఉండదు. ఏం జరుగుతుందనేది ఈ మధ్యాహ్నం నుంచి తేలుతుంది.

Back to top button