అత్యంత ప్రజాదరణవ్యాపారము

రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమ.. ఎలా చెక్ చేయాలంటే..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ఒకటనే సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ స్కీమ్ కు సంబంధించి ఏడు విడతల నగదు ఖాతాల్లో జమ కాగా ఈరోజు ఎనిమిదో విడత నగదు ఖాతాల్లో జమైంది. వాస్తవానికి గత నెలలోనే ఈ నగదు రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.

పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్రం గత నెలలో రైతుల ఖాతాల్లో నగదును జమ చేయాలేదు. ఈరోజు నుంచే అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమవుతూ ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రైతుల ఖాతాలలో ఏకంగా రూ.6 వేలు జమ చేస్తోంది. ఒకేసారి కాకుండా మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఈ నగదును జమ చేస్తోంది.

రైతులు తమ ఖాతాలలో నగదు జమైందా..? లేదా..? అనే వివరాలను పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి బెనిఫీసియరీ స్టేటస్ ఆప్షన్ ద్వారా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అర్హతలు ఉండి ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోని వాళ్లు ఆన్ లైన్ లో పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ ద్వారా ఏ ఖాతాలో నగదు జమైందో కూడా తెలుసుకోవచ్చు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా రైతుల కోసం ప్రత్యేక స్కీమ్ లను అమలు చేస్తుండటం గమనార్హం.

Back to top button