వ్యాపారము

రైతులకు షాక్.. పీఎం కిసాన్ డబ్బులు రావా..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తుండగా ఆ స్కీమ్ లలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. ఈ నెల తొలి వారమే రైతుల ఖాతాలలో నగదు జమ కావాల్సి ఉండగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఈ నెల చివరి వారంలో రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు జమవుతాయని వెల్లడించారు. అయితే రైతుల ఖాతాలలో ఇప్పటివరకు నగదు జమ కాలేదనే సంగతి తెలిసిందే.

ప్రతి సంవత్సరం రైతులకు కేంద్రం ఈ స్కీమ్ కింద 6 వేల రూపాయలు అందిస్తోంది. కేంద్రం ఈ నగదును 2,000 రూపాయల చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాలలో జమ చేస్తుండటం గమనార్హం. వచ్చే నెలలో రైతుల ఖాతాలలో ఈ నగదు జమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ మేరకు అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. కేంద్రం జమ చేసే ఈ నగదు రైతులకు పెట్టుబడిసాయంగా ఉపయోగపడుతుంది.

ఇప్పటివరకు 7 విడతల నగదు రైతుల ఖాతాలలో జమైన సంగతి విదితమే. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రైతుల కోసం పలు పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ అమలు చేస్తున్న ఈ పథకంపై రైతుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అర్హత ఉండి ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందలేని వాళ్లు ఆన్ లైన్ లో ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా రైతులు ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. సరైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయడం ద్వారా రైతులు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

Back to top button