అత్యంత ప్రజాదరణవ్యాపారము

రైతులకు శుభవార్త.. ఇలా చేస్తే ఖాతాలోకి రూ.4 వేలు..?

pm kisan samman nidhi latest news farmers get rs 4000

అన్ని అర్హతలు ఉండి పీఎం కిసాన్ స్కీమ్ లో చేరని వాళ్లకు మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. జూన్ 30లోపు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ లో చేరిన వాళ్లు రెండు ఇన్‌స్టాల్‌మెంట్ల డబ్బులు వెంటవెంటనే పొన్డే అవకాశం ఉంటుంది. జూన్ నెలలోపు దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన వారికి జూన్‌ లేదా జూలైలో రూ.2 వేలు ఖాతాలో జమ కావడంతో పాటు ఆగస్ట్ నెలలో మరో విడత రూ.2 వేల డబ్బులు జమవుతాయి.

రెండు విడతల డబ్బును వెంటవెంటనే పొందటానికి అవకాశం ఉండటంతో ఇప్పటివరకు ఈ స్కీమ్ లో చేరని వాళ్లు వెంటనే చేరితే మంచిది. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరాలని అనుకుంటారో వాళ్లు ఎటువంటి డబ్బులు చెల్లించకుండా ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్ స్కీమ్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ స్కీమ్ లో సులభంగా చేరవచ్చు. కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ స్కీమ్ 8వ విడత డబ్బును రైతుల ఖాతాలలో జమ చేయనుంది.

రైతులకు ఆర్థిక చేయూత, పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్ అమలు వల్ల రైతులకు ఎంతగానో మేలు జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి 6 వేల రూపాయలు ఈ స్కీమ్ ద్వారా అందిస్తోంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో పొందవచ్చు. నెలకు 2 వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఖాతాల్లో నగదు జమవుతాయి.

ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఏదైనా కారణం చేత దరఖాస్తు రిజెక్ట్ అయితే పీఎం కిసాన్ స్కీమ్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ స్కీమ్ లో సులభంగా చేరే అవకాశం ఉంటుంది. నగదు జమైన తరువాత పీఎం కిసాన్ వెబ్ సైట్ కు వెళ్లి ఏ ఖాతాలో నగదు జమయిందో ఆ వివరాలు కూడా తెలుసుకోవచ్చు.

Back to top button