జాతీయంరాజకీయాలు

చైనాపై మోడీ వ్యూహం ఫలించేనా?


భారత్ ప్రస్తుతం కరోనా మహమ్మరితోపాటు.. సరిహద్దుల్లో చైనాను ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ రెండింటిలోనూ భారత్ యుద్ధం సాధిస్తుందని ప్రధాని మోడీ ఘంటాపథంగా చెబుతోన్నారు. ఓవైపు శాంతి చర్చల పేరుతో బరితెగింపులకు పాల్పడుతున్న చైనాకు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు ప్రధాని మోదీ బహుముఖ వ్యూహంతో ముందుకెళుతోన్నారు. చైనాను కట్టడి చేసేందుకు మోదీ రక్షణపరంగానూ, దౌత్యపరంగా, ఆర్థికంగా ఒత్తిడి పెంచుతున్నారు. చైనాకు ముక్కుతాడు వేసేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

జగన్ కు కేసుల ఫీవర్ పోలేదా?

భారత్ కంటే చైనా రక్షణపరంగా పెద్ద దేశం. చైనాకు బరితెగించిన దేశంగా.. ఎవరికీ లెక్కచేయని దేశంగా పేరుంది. కరోనా మహమ్మరిని ప్రపంచం వ్యాప్తంగా చైనా వైరస్ అంటూ గేలిచేస్తున్న పరిస్థితులున్నాయి. చైనా అంటే భయపడే దేశాలు సైతం ప్రస్తుతం చైనాను లెక్కని చేయడం లేదు. దీంతో చైనా తన ప్రతాపాన్ని ప్రపంచానికి చాటాలని యత్నిస్తుంది. అందులో భాగంగా సరిహద్దుల్లో భారత్ ను కవ్విస్తోంది. భారత్ ను దెబ్బతీయడం ద్వారా ప్రపంచానికి తన సైనిక సత్తాను చాటడంతోపాటు ఆసియాలో పెత్తనం చేయాలని చూస్తుంది. దీనిని ముందుగానే పసిగట్టిన భారత్ చైనా వ్యూహాన్ని తిప్పికొడుతోంది.

గాల్వానాలో భారత సైనికులను దొంగదెబ్బతీసి 21మందిని చైనా పొట్టనపెట్టుకుంది. అయినప్పటికీ భారత జవాన్లు చైనా సైన్యాన్ని సమర్థవంతం ఎదుర్కొని సరిహద్దుల నుంచి తరిమివేశారు. ఈ సంఘటనలో చైనాకు కూడా పెద్దనష్టం వాటిలినట్లు తెలుస్తున్న చైనా అధికారికంగా ప్రకటించడం లేదు. భారత జవాన్ల మృతితో యావత్ భారతం చైనాకు వ్యతిరేకంగా నినదించింది. చైనా వస్తువుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. అదేవిధంగా కేంద్రం సైతం చైనా కంపెనీలకు చెందిన పలు కాంట్రాక్టులను రద్దు చేసింది. సరిహద్దుల్లో సైనికులకు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అధికారం కల్పించింది.

జులై నుంచి కొత్త లాక్ డౌన్ రూల్స్?

భారత్ శాంతికాముఖ దేశమని చెబుతూనే గీతదాటివస్తే భారత ఆర్మీ సత్తా చాటడానికి సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే ఎంతదూరమైనా వెళుతామని హెచ్చరించారు. సరిహద్దుల్లోని గాల్వాన్ లోయ ప్రాంతం భారత్ కు కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలోకి చైనాను ఎట్టిపరిస్థితుల్లోకి రానివ్వకుండా భారత సైనికులు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. యుద్ధ విమానాలను రంగంలో దింపి సరిహద్దుల్లో వాయుసేన గస్తీ కాస్తుంది.

భారత్ కు ఇప్పటికే అమెరికా, రష్యా దేశాలు బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారు. తమ బలగాలను భారత్ పంపిందుకే సిద్ధమనని అమెరికా తాజాగా ప్రకటించింది. రక్షణపరంగా, దౌత్యపరంగా, ఆర్థికంగా చైనాపై మోదీ ఒత్తిడిపెంచుతున్నారు. డ్రాగన్ కు కళ్లెం వేసేందుకు మోదీ అనుసరిస్తున్న వ్యూహం కరెక్టేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో చైనా ప్రపంచం ముందు దోషిగా నిలబడుతుందా? లేదా భారత్ కు తలొగ్గుతుందా? అనేది వేచి చూడాల్సిందే..!