తెలంగాణరాజకీయాలు

నాగబాబు పై కేసు నమోదు!

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నాగబాబు తాజాగా మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే పుట్టినరోజు సందర్భంగా వివాదాస్పద వాఖ్యలు చేశాడు. దీంతో ఆయన పై ఉస్మానియా యూనివర్సీటీ (ఓయూ) పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదు అయింది. గాడ్సే నిజమైన దేశభక్తుడని అంటూ ట్వీట్ చేశాడు. నాగబాబు చేసిన ఈ వాఖ్యాలపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఈ నేపధ్యంలోనే నాగబాబుపై టీపీసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నటుడు నాగబాబుకు మతి భ్రమించిందని, అయన మానసిక పరిస్థితి బాగాలేనందునే ట్విట్టర్‌ లో జాతిపిత గాంధీని చంపిన నాథూరాం గాడ్సే‌ దేశభక్తుడని అన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వాఖ్యలు చేసిన నాగబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు కూడా నాగబాబు ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటలు పిల్లలు ఉంటే గాంధీ ని మరిచిపోతారంటూ.. ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో  నాగబాబు మరో ట్వీట్ చేశాడు. ‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్ లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను. నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం. ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వాళ్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం’ అంటూ నాగబాబు మరో ట్వీట్ చేశారు.