సినిమాసినిమా వార్తలు

Police Case on Payal: ఆర్ఎక్స్100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పై పోలీస్ కేసు

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మాస్క్ ధరించకుండా అసలు కరోనా నిబంధనలు పాటించలేదని కేసు నమోదుచేయాలని కోర్టులో కోరారు. దీంతో సివిల్ కోర్టు జడ్జి సిఫార్సు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.

Police Case on Payal Rajput

Police Case on Payal: ఎరక్కపోయి ఇరుక్కుపోయింది పాయల్ రాజ్ పుత్. కరోనా నిబంధనల వేళ ఓ వస్త్ర దుకాణం షాప్ ఓపెనింగ్ కు వెళ్లి ఇప్పుడు అడ్డంగా బుక్కైంది. డబ్బులకు ఆశపడిన పాపానికి ఇప్పుడు పోలీస్ కేసు ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో పడింది.

గత నెల 11న తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ వచ్చింది. ఈ కార్యక్రమంలో ఆమె కరోనా నిబంధనలు పాటించకుండా ఫోటోలకు ఫోజులిచ్చింది. మాస్క్ ధరించకపోవడంతోపాటు కోవిడ్ నిబందనలు పాటించలేదట.. ఈ క్రమంలోనే ఆమెపై పెద్దపల్లికి చెందిన బొంకూరి సంతోషఊ్ కోర్టులో ఫిర్యాదు చేశారు.

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మాస్క్ ధరించకుండా అసలు కరోనా నిబంధనలు పాటించలేదని కేసు నమోదుచేయాలని కోర్టులో కోరారు. దీంతో సివిల్ కోర్టు జడ్జి సిఫార్సు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానితోపాటు పలువరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆర్ఎక్స్100తో ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ తెరపై అందాలు ఆరబోసి హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అనంతరం వెంకటేశ్ సరసన వెంకీ మామ, రవితేజ పక్కన డిస్కో రాజా వంటి సినిమాలు చేసింది. అయితే పెద్దగా బ్రేక్ రాలేదు. తాజాగా  షాప్ ఓపెనింగ్ కు వచ్చిన ఈ ముద్దుగుమ్మ అనవసరంగా కష్టాల్లో పడినట్టైంది.

Back to top button