ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

దేవినేని ఉమా కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు

Police intercepting Devineni Uma's convoy

రాజమహేంద్రవరం జైలు నుంచి మాజీ మంత్రి తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఇవాళ విడుదలయ్యారు. ఈ సందర్భంగా తెదేపా శ్రేణులు ఉమాకు ఘనస్వాగతం పలికారు. రాజమహేంద్రవరం నుంచి ఉమా వెంట తెదేపా శ్రేణులు భారీ కాన్వాయ్ తో బయల్దేరారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సమీపంలోకి రాగానే ఉమా కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. రహదారికి అడ్డంగా లారీలు, ట్రక్కులు పెట్టి తెదేపా నేతలు, కార్యకర్తలు ప్రయాణిస్తున్న వాహనాలను రోడ్డుపైనే నిలిపివేశారు. దేవినేని ఉమా ప్రయాణిస్తున్న ఒక్క కారును పంపి, వాహనశ్రేణిలోని మిగిలిన కార్లను పంపకనోవడంతో దేవినేని ఉమా, పట్టాభి ఇతర నేతలు అక్కడే నిరసనకు దిగారు. భీమడోలు రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

Back to top button