క్రీడలు

పోలర్డ్ విధ్వంసం.. గెలిచే చెన్నై ఓడింది ఇక్కడే!

Pollard destruction .. What was the reason for the defeat of Chennai?

ఢిల్లీ వేదికగా సునామీ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ పరుగుల సునామీ సృష్టించింది. సిక్సర్లతో తుఫాన్ వచ్చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నైకి అంబటి రాయుడు విధ్వంసంతో సునామీ సృష్టించాడు. కేవలం 27 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఏడు సిక్సులు, 4 ఫోర్లతో దంచికొట్టాడు. మెయిన్ అలీ 58, డుప్లెసిస్ 50 పరుగులతో రాణించారు.

అయితే మేమేం తక్కువ కాదని.. అంతకుమించి ఆటతో ముంబై ఇండియన్స్ రెచ్చిపోయింది. ముంబై బ్యాట్స్ మెన్ పోలార్డ్ ప్రళయం సృష్టించాడు. పరుగుల విందును మరోస్థాయికి తీసుకెళ్లాడు. 34 బంతుల్లోనే 87 పరుగులు చేసి చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఐపీఎల్ లోనే భారీ లక్ష్యాన్ని ఛేదించింది.

ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక లక్ష్యఛేదన. ఈ టోర్నీలో చెన్నైకి ఇది రెండో ఓటమి. పోలార్డ్ ధాటికి ఓడింది.. లేకుంటే చెన్నై గెలిచేదే. చివరి బంతికి ముంబై ఇండియన్స్ ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది.

ఆరు బంతుల్లో ముంబైకి కావాల్సిన 16 పరుగులు కావాల్సి ఉంది. ఆఖరి ఓవర్లో ఎంగిడి నియంత్రణతో బౌలింగ్ చేయలేకపోయాడు. ఫుల్ టాస్ లు వేశాడు. లేకుంటే ముంబై గెలిచేది కాదు.. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా.. రెండు పరుగులు చేసి ముంబైని పోలార్డ్ గెలిపించాడు. అయితే 18వ ఓవర్ లో పోలార్డ్ ఇచ్చిన ఓ తేలికైన క్యాచ్ ను డుప్లిసెస్ వదిలేయడంతోనే ముంబైని పోలార్డ్ గెలిపించాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే చెన్నై గెలిచి ఉండేది. అదే మ్యాచ్ లో చెన్నై ఓటమికి కారణమైంది.

Back to top button