టాలీవుడ్సినిమా

తగ్గాల్సిన టైమ్‌లో పెంచేసిన పూజా హెగ్డే!


పూజా హెగ్డే. టాలీవుడ్‌లో ఇప్పుడు విపరీతమైన డిమాండ్‌ ఉన్న నటి. తెలుగు ఇండస్ట్రీలో ఆమెనే నంబర్ వన్‌ హీరోయిన్‌ అనొచ్చు. ఆమె పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ మధ్య. భారీ ప్రాజెక్టులు సొంతం చేసుకుంటూ అంతకుమించిన భారీ విజయాలు సాధిస్తోందామె. ఈ స్టార్డమ్‌ కోసం ఆమె చాలానే కష్టపడింది. మోడలింగ్‌ తర్వాత నటనలోకి వచ్చిన పూజ.. 2012లో వచ్చిన తమిళ మూవీ ముగమూడి (తెలుగులో మాస్క్‌)తో తెరంగేట్రం చేసింది. ఆ మూవీలో నల్లగా కనిపించిందని.. హీరోయిన్‌ మెటీరియల్‌ కాదని పూజపై విమర్శలు వచ్చాయి. కానీ, వరుణ్‌ తేజ్‌ హీరోగా పరిచయమైన ముకుందలో చాన్స్‌ రావడం ఆమె కెరీర్కు ప్లస్‌ అయింది. ఆ సినిమాతో పూజకు మంచి పేరొచ్చింది. ఆ వెంటనే నాగ చైతన్యతో ఒక లైలా కోసం సినిమా చేసింది. కానీ, అది ఫ్లాప్‌ కావడం… హిందీలో హృతిక్‌ రోషన్‌ సరసన చాన్స్‌ రావడంతో వెంటనే బాలీవుడ్‌కు చెక్కేసింది.

Also Read: పవన్‌ సరనన రకుల్‌.. నిజమేనా క్రిష్!

హృతిక్‌తో కలిసి మొహెంజొదారో మూవీలో నటించింది పూజ. అదే టైమ్‌లో అతనితో ప్రేమలో పడిందని, చాన్నాళ్లు డేటింగ్‌ చేసిందన్న వార్తలు వచ్చాయి. కానీ, ఆ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. హృతిక్‌తో రిలేషన్‌షిప్‌ కూడా బెడిసికొట్టడంతో బాలీవుడ్‌లో ఆఫర్లు కరువయ్యాయి. అలాంటి టైమ్‌లో అల్లు అర్జున సరసన ‘దువ్వడ జగన్నాథం (డీజే)’ ఆఫర్ రావడం ఆమె కెరీర్ను మలుపు తిప్పింది. డీజేలో మంచి నటనతో పాటు బికినీ అందాలు ప్రదర్శించిన పూజ యువకుల గుండెలు కొల్లగొట్టింది. అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. రంగస్థలంలో జిగేల్‌ రాణి పాటకు స్టెప్పులేసి కిక్కిచ్చిన ఆమె… అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేశ్‌తో పాటు రీసెంట్‌గా అలవైకుంఠపురములోతో వరుసగా నాలుగు విజయాలు ఖాతాలో వేసుకుంది. మధ్యలో హిందీలో హౌస్‌ఫుల్‌ 4తో సక్సెస్‌ సాధించింది. ముంబై నుంచి హైదరాబాద్‌కు చార్టర్డ్‌ ఫ్లయిట్‌లో వచ్చి షూటింగ్స్‌లో పాల్గొనేంత బిజీగా మారిపోయిందామె.

Also Read: ఒక్క డైలాగ్‌ లేకుండా ఆర్జీవీ.. ‘మర్డర్’ ట్రైలర్

ఇంత సక్సెస్‌ ఉండడంతో తెలుగు దర్శక నిర్మాతలకు ఆమె అదృష్ట దేవతగా మారింది. అయితే, ఇప్పుడు ఆ దేవత దర్శన భాగ్యం… అదే డేట్స్‌ కోసం హుండీలో నిర్మాతలు భారీగానే వేయాల్సి వస్తోందట. కరోనా టైమ్‌లో మిగతా నటీనటులు రెమ్యునరేషన్‌ను తగ్గించుకుంటుంటే పూజ మాత్రం తన పారితోషికం మరోసారి పెంచిందని తెలుస్తోంది. బెల్లకొండ శ్రీనివాస్‌ హీరోగా నటించిన ‘సాక్ష్యం’కు ఆమె రూ. కోటిన్నర తీసుకుందట. అంతకుముందు వరకూ కోటితోనే సరిపెట్టిన ఆమె ఒక్కసారిగా యాభై లక్షలు పెంచింది. చిన్న హీరోతో సినిమా కాబట్టి ఆమె ఎక్కువగా చార్జ్‌ చేసిందట. అయితే, అలవైకుంఠపురములో తన డేట్స్‌ ఆధారంగా రూ. 1.40 కోట్లు తీసుకుందట. ఇది మూవీ భారీ సాధించినప్పటికీ ప్రభాస్‌ సరసన ‘రాధేశ్యామ్‌’ కోసం కోటి మాత్రమే అందుకుంటోందామె. ఎందుకంటే అల వైకుంఠపురములో కంటే ముందే దానికి సైన్‌ చేసింది పూజ. అయితే, ఇప్పుడు తన పారితోషికాన్ని పూజ రెండు కోట్లకు పెంచిందని టాలీవుడ్‌ టాక్‌. ‘అల’ హిట్‌తో పాటు బాలీవుడ్‌ నుంచి కూడా ఆఫర్లు వస్తుండడంతో రేటు అమాంతం పెంచిందని తెలుస్తోంది. అక్కినేని అఖిల్‌తో ‘బ్యాచిలర్’ కోసం కాస్త అటు ఇటుగా ఆమె రెండు కోట్ల దాకా తీసుకుందట. అయితే, ఇకపై వచ్చే ప్రాజెక్టులకు ఓకే చెప్పాలంటే మినిమమ్‌ రెండు కోట్ల గ్యారంటీ ఇస్తేనే కథ వింటానని తన మేనేజర్ల ద్వారా స్పష్టం చేసిందని తెలుస్తోంది. పూజ ట్రాక్ రికార్డు, సక్సెస్, తెరపై అమె అందం, అభినయాన్ని వెలకట్టలేం. అయితే, కరోనా టైమ్‌లో పలువురు హీరోలు, హీరోయిన్లు పారితోషికం తగ్గించుకోవాలని చూస్తుంటే తాను మాత్రం పెంచాలని నిర్ణయించుకోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రెమ్యునరేషన్‌ విషయంలో పట్టుబడితే కొన్ని కీలక అవకాశాలు చేజారి.. కెరీర్ దెబ్బతినే ప్రమాదం ఉందని పలువురు చెబుతున్నారు. మరి, పూజ పరిస్థితి ఎలా ఉంటుందో..!

Tags
Show More
Back to top button
Close
Close