టాలీవుడ్సినిమా

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన పూజ హెగ్డే !

Pooja Hegde
పూజ హెగ్డే…అమ్మడు కెరీర్ మొదట్లో చేసిన సినిమాలన్నీ నిరాశ పరిచాయి. పాప పని అయిపోయింది అన్న సమయంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీ తో తొలి విజయం దక్కింది. ఇక అక్కడ నుండి ఈ భామ రాత మారిపోయింది. నటించిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. ఐరన్ లెగ్ కాస్త ఇప్పుడు గోల్డెన్ లెగ్ అయిపోయింది. గత ఏడాది త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ‘అల వైకుంఠపురంలో’ కూడా ఈ ముద్దుగుమ్మనే నటించి ఆ మూవీ ఘన విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది.

Also Read: రివ్యూ : మాస్టర్ – బోరింగ్ యాక్షన్ డ్రామా !

అలా వైకుంఠపురంలో సాధించిన సక్సెస్ ని ఆ చిత్రం విడుదలై ఏడాది సందర్భంగా రీ-యూనియన్ మీటింగ్ తో యూనిట్ అందరూ కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫంక్షన్లో హీరోయిన్ పూజ హెగ్డే మాట్లాడుతూ… తన నెక్స్ట్ సినిమా కూడా దర్శకుడు త్రివిక్రంతోనే అని చెప్పేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో త్రివిక్రమ్, ఎన్టీఆర్ ప్రాజెక్టులోనే ఈ బ్యూటీ నటించబోతుందని సినీ అభిమానులు ఫిక్స్ అయ్యారు.

Also Read: ట్రైలర్ టాక్: ‘కపటధారి’ సుమంత్.. క్రైమ్ థిల్లర్

ప్రస్తుతం పూజ తెలుగులో అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ షూటింగ్ చివరి దశలో ఉండగా , ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ లో నటిస్తుంది. అంతేకాకుండా బాలీవుడ్ లో మరో రెండు కేజ్రీ ప్రాజెక్ట్స్ ని కూడా ఆమె లైన్ లో పెట్టారు. ఈ లక్కీ బ్యూటీ త్రివిక్రమ్ ప్రాజెక్టులోకి ఎంటర్ అవటంతో ఎన్టీఆర్ కి కూడా ఇండస్ట్రీ హిట్ ఖాయం అని నందమూరి అభిమానులు సంబరపడిపోతున్నారట.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button