అత్యంత ప్రజాదరణగుసగుసలుటాలీవుడ్సినిమా

పంతులమ్మగా మారిన ప్రభాస్ హీరోయిన్?


యంగ్ రెబ‌ల్‌ స్టార్ ప్ర‌భాస్ తాజాగా రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తున్నాడు. ‘సాహో’ మూవీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీకి ‘రాధే’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రభాస్ కు జోడీగా ‘జిగేల్ రాణి’ పూజా హెగ్డే నటిస్తుంది. పీరియాడికల్ లవ్ స్టోరీతో అత్యంత భారీ బడ్జెట్లో ఈ మూవీని గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ నిర్మిస్తున్నాయి. లాక్డౌన్ ముందు యూరోప్ ఈ మూవీకి సంబంధించి యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. అనంతరం లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెల్సిందే. అయితే ఈ మూవీలో హీరోయిన్ పూజా హెగ్డే పాత్రపై ఫిల్మ్ నగర్లో ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది.

పూజా హెగ్డే ఈ మూవీలో పంతులమ్మగా కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. యూరప్ నేపథ్యంలో ఫ్లాష్ బ్యాక్ వచ్చే సన్నివేశాల్లో పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్ గా కనిపించదట. దీంతో పూజా హెగ్డే పాత్రపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటించనుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని సమాచారం. ఈ మూవీని 2020 ద‌స‌రా సెలవుల్లో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది. తాజాగా సినిమా షూటింగ్ వాయిదా పడటంతో అనుకున్న సమయానికి మూవీ రిలీజ్ అవుతుందో లేదోననే టెన్షన్ అభిమానుల్లో మొదలైంది.

అదేవిధంగా ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ వైజయంతి బ్యానర్లో ఓ మూవీ చేయనున్నాడు. ‘రాధే’ మూవీ పూర్తయ్యాక వైజయంతి బ్యానర్లో నటించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రకటనను దర్శకుడు నాగ్ అశ్విన్ అనౌన్స్ చేశాడు. సైంటిఫిక్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఇందులో సూపర్ హీరో తరహాలో ప్రభాస్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.