టాలీవుడ్సినిమా

నిన్ను చూస్తే బాధేస్తోంది… ఆర్జీవీపై పూనమ్‌ కౌర్ ఫైర్!


సెన్సేషనల్‌ డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపారు. ‘పవర్ స్టార్’ అనే టైటిల్‌తో మూవీ చేస్తున్నానని చెప్పడంతో అది పవన్‌ కళ్యాణ్‌ ను ఉద్దేశించి తీస్తున్నదే అన్న రచ్చ మొదలైంది. ‘ఆర్జీవి వర‌ల్డ్ థియేట‌ర్‌లో రిలీజ్ కానున్న నెక్ట్స్ మూవీ టైటిల్ ప‌వ‌ర్ స్టార్. పీకే, ఎంఎస్‌, ఎన్‌ బి, టీఎస్‌, ఒక రష్యన్‌ వుమన్‌, న‌లుగురు పిల్లలు, 8 గేదెలు, ఆర్జీవీ ఇందులో నటిస్తున్నారు. ఈ పాత్రలను అర్ధం చేసుకున్న వారికి ఎలాంటి బ‌హుమ‌తులు ఇవ్వబడ‌వు’ అని ట్వీట్‌ చేశాడు.

పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

ఈ ట్వీట్‌ను షేర్ చేసిన నటి పూనమ్‌ కౌర్ నేరుగా పేరు ప్రస్తావించకుండా ఘాటు విమర్వలు చేసింది. ‘ఈ చిత్రంలో అందులో ఆర్జీవీ అనే పాత్రను కూడా చేర్చండి. అమ్మాయిలకు ఫోన్‌ చేసి వాళ్ల ఎమేషనల్‌ వీక్‌నెస్‌ ఏంటో తెలుసుకుంటాడు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో అసభ్యమైన భాషను ఉపయోగించమని ప్రేరేపిస్తాడు. కొన్ని ట్వీట్లు పంపి వాటిని షేర్ చేయమంటాడు. అలా చేయగానే మీడియాకు సమాచారం వెళ్తుంది. మిమ్మల్ని నా చిన్నపుడు గౌరవించేదాన్ని.. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని చూసి బాధపడుతున్నా’ అని పూనమ్ ట్వీట్ చేసింది.

అనంతరం ఆమె మరో ట్వీట్ చేసింది. ‘ ఆ దేశద్రోహి డైరెక్టర్ చేసిన ఫోన్ కాల్స్ రికార్డు చేసి ఉంటే బాగుండేది. అతడు నాకు ఫోన్ చేసి ఒకరి వ్యక్తిత్వం గురించి మాట్లాడాలని గంటల తరబడి నన్ను బ్రెయిన్ వాష్ చేసేవాడు. నాకు కొన్ని ట్వీట్లు పంపి షేర్ చేయమనేవాడు. ఆ ట్వీట్లను సంబంధిత పార్టీ వ్యక్తికి పంపించాను. మీడియాలో కొందరైనా నిజాయితీగా ఉన్నందుకు ఆ దేవుడికి కృతజ్క్షతలు. లేకపోతే నీ ఉద్దేశాలు ఏమిటో తెలిసేవి కాదు’ అని పూనమ్ రాసుకొచ్చింది.