తెలంగాణరాజకీయాలు

టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన పోసాని.. చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు..!

Posani Krishna Murali

తెలంగాణలో దుబ్బాక ఎన్నికల తర్వాత రాజకీయ వేడిరాజుకుంది. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోవడంతో తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు స్పష్టమైంది. ఈ సమయంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రావడాన్ని టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకొని తెలంగాణలో టీఆర్ఎస్ హవా తగ్గలేదని నిరూపించాలని చూస్తుంది.

Also Read: టీఆర్ఎస్ నేతలే గెలిపించారు.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

ఈక్రమంలోనే సెలబ్రెటీల మద్దతును టీఆర్ఎస్ కూడగడుతోంది. సెలబ్రెటీలతో తెలంగాణను టీఆర్ఎస్ అన్నివిధలా అభివృద్ధి చేసిందని.. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పట్టంకట్టండి అంటూ ప్రచారం చేయిస్తుంది. ఈక్రమంలోనే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటిస్తున్న సెలబ్రెటీలపై నెటిజన్లు ఓ రేంజులో విరుచుకుపడుతుండటం చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన గోరటి వెంకన్న.. ప్రజా యుద్ధనౌక గద్దర్ టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. ఈక్రమంలో కేసీఆర్ పాలన అద్భుతమని కొనియాడారు. దీంతో నెటిజన్లు వీరిపై ప్రశ్నలవర్షం కురిపించారు. ఇక తాజాగా వైఎస్సాఆర్సీపీ నాయకుడు, సినీనటుడు పోసాని మురళీ టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించడంతో నెటిజన్లు ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను బాగా అభివృద్ధి చేశాడని.. తెలంగాణలోని సమస్యలన్నింటినీ తీర్చేశాడని.. మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతవాసులకు బాగా చూసుకుంటున్నారని తెలిపాడు. గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాడు. పోసాని వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Also Read:  గళగళ మాట్లాడే సుమ.. కేటీఆర్ మాటలకు స్టన్ అయిపోయింది.. ఎందుకు?

ఏడాదిన్నర కిందట ఇంటర్ విద్యార్థులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు.. యావత్ తెలంగాణ విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేసినప్పుడు పోసాని వారికి మద్దతు ప్రకటించలేదని ప్రశ్నించారు. సినిమాల్లో విద్యార్థుల భవిష్యత్.. దేశం గురించి పేజీలకు పేజీలు డైలాగులు రాసే పోసాని అప్పుడేం అయ్యారని నిలదీశారు. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు పోసాని వారికి ఎలా అండగా నిలిచారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే వైఆర్సీసీపీ టీఆర్ఎస్ కు బహిరంగంగా మద్దతు ఇచ్చేందుకే పోసానితో అలా వ్యాఖ్యలు చేసినట్లుగా అర్థమవుతుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల టీఆర్ఎస్ కు పోసాని మద్దతు ప్రకటించడం ద్వారా టీఆర్ఎస్ లాభం ఉందో లేదోగానీ గతంలో టీఆర్ఎస్ చేసిన పొరపాట్లన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఆ పార్టీని మరింత ఇరుకున పెడుతున్నాయి. ఇదంతా చూస్తుంటే టీఆర్ఎస్ వర్సెస్ సోషల్ మీడియా అన్నట్లు ఎన్నికల ప్రచారం జరుగుతుందా? అన్న అభిప్రాయం కలుగకమానదు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Back to top button