కరోనా వైరస్

ప్రజలకు షాక్.. ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా..?

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. ఫస్ట్ వేవ్ లో లాక్ డౌన్ నిబంధనలు అమలు కావడంతో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కాగా సెకండ్ వేవ్ లో మాత్రం రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో దాదాపు మూడున్నర లక్షల కేసులు నమోదు కాగా 2,700 కంటే ఎక్కువమంది మృతి చెందారు. మరోవైపు కరోనా పరీక్ష చేయించుకున్న ప్రతి ఐదుగురిలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అవుతోంది.

దేశంలో కరోనా పాజిటివిటీ రేటు ఏకంగా 20 శాతంగా ఉండటం గమనార్హం. కరోనా భయం వల్ల, ఇతర కారణాల వల్ల కొంతమంది కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. దేశంలో నమోదవుతున్న కేసులతో పోలిస్తే వెలుగులోకి వస్తున్న కేసుల సంఖ్య తక్కువగానే ఉందని వైద్యులు, శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. పరీక్షల సంఖ్య మరింత పెంచితే పాజిటివిటీ రేటు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి.

దేశంలోని 15 రాష్ట్రాల్లో గరిష్ట స్థాయిలో కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో రోజురోజుకు పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో లాక్ డౌన్ ను అమలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది.

దేశంలో లాక్ డౌన్ అమలు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా కేంద్రం ఆఖరి అస్త్రంగా మాత్రమే లాక్ డౌన్ ను అమలు చేసే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.

Back to top button