టాలీవుడ్సినిమా

సంక్రాంతి పోరులో చిరు, ప్రభాస్ లేనట్లే !


కరోనా వచ్చి టాలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్స్ ను అయోమయంలో పడేసింది. అయితే ఈ సారి సంక్రాంతికి సినిమాల పోటీ హోరాహోరీగా ఉండబోతుందని.. సినిమా హాళ్లు కూడా పూర్తిస్థాయిలో సంక్రాంతి నాటికి తెరుచుకునే అవకాశం ఉందని.. అందుకే స్టార్ హీరోల సినిమాలను సంక్రాంతి సీజన్లోనే విడుదల చేయాలని చూస్తున్నారని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, అలాగే భారీ బడ్జెట్ చిత్రం ‘కెజిఎఫ్ 2’ పోటిగా రానున్నాయి. అలాగే ఇంకొన్ని ఆసక్తికరమైన చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది.

Also Read: మహేశ్ బాబు గ్లామర్ రహస్యం తెలిసిపోయింది?

అఖిల్, పూజా హెగ్డేల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, రవితేజ ‘క్రాక్’, గోపిచంద్ ‘సీటిమార్’, నాగచైతన్య ‘లవ్ స్టోరీ’లు కూడ సంక్రాంతికే విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బాలయ్య – బోయపాటి సినిమా కూడా సంక్రాంతికే రాబోతుంది. కాకపోతే ఏ సినిమా ఎప్పుడు రెడీ అవుతుందో.. అసలు ఏ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా ఇంతవరకూ క్లారిటీ లేదు. మరి ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అన్నది ఇప్పుడే ఎలా చెప్పగలం అని ఫిల్మ్ సర్కిల్స్ లో మాటలు వినిపిస్తున్నా.. పై రిలీజ్ లిస్టులో ఉన్న సినిమాలన్నీ ఇప్పటికే మెజార్టీ షూటింగ్ ను పూర్తీ చేసుకున్నాయట.

Also Read: ‘రింగు’లోకి వస్తున్న విజయ్ దేవరకొండ..!

అయితే ప్రభాస్ ‘రాథేశ్వామ్’, మెగాస్టార్ ‘ఆచార్య’, ‘బన్నీ – సుకుమార్’ సినిమాలు మాత్రం సంక్రాంతి పోరులో లేవు అట. ఎందుకంటే మెగాస్టార్ ఆచార్య సినిమా షూటింగ్ ఇంకా 80 రోజులకు పైగా వుంది. సుకుమార్ – బన్నీ సినిమా సరిగ్గా షూట్ నే స్టార్ట్ చేయలేదు. ఇక ప్రభాస్ రాథేశ్వామ్ డిసెంబర్ లోపు షూట్ వరకు అయిపోయినా…ఆ సినిమాకు ఎక్కువ విఎఫ్ఎక్స్ పనులు వున్నాయట. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరో నెలన్నర నుంచి రెండు నెలలు వుంటుంది. అందువల్ల ఈ మూడు సినిమాలు సంక్రాంతికి రావడం కష్టమే.

Back to top button