అత్యంత ప్రజాదరణటాలీవుడ్సినిమా

నార్త్ పై ప్రభాస్ స్పెషల్ ఫోకస్..


డార్లింగ్ ప్రభాస్ కు దక్షిణాదితోపాటు ఉత్తరాదిన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ ఇండియాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. ‘బాహుబలి’ సిరీసులతో ప్రభాస్ దక్షిణాదితోపాటు నార్త్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ‘బాహుబలి‘, ‘బహుబలి-2’ మూవీలు ఉత్తరాదిన భారీ కలెక్షన్లు సాధించి ప్రభాస్ ను ఇండియన్ హీరోగా మార్చేశాయి. ఈ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ప్రభాస్ ‘సాహో’గా ప్రేక్షకులకు ముందుకొచ్చాడు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ దక్షిణాదిన అనుకున్నంత విజయం సాధించకపోయినా నార్త్ తో మాత్రం భారీ విజయం సాధించింది. నార్త్ లో ప్రభాస్ స్టామీనా ఏంటో ‘సాహో’ మూవీ చూపించింది. దీంతో ప్రభాస్ నార్త్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నాడు.

టాలీవుడ్లో సంక్రాంతి, దసరా సినిమాలకు హీరోలంతా ఫస్టు లుక్, ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కు శుభాకాంక్షలు చెబుతుంటారు. మనలాగే నార్త్ లోనూ హీరోలంతా రంజాన్ కు తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంటారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ లాంటి హీరోలు రంజాన్ కు తమ సినిమాలను రిలీజ్ చేస్తూ సూపర్ హిట్లు కొడుతుంటారు. ఇదేతరహాలో ప్రభాస్ కూడా రంజాన్ సందర్భంగా ఫ్యాన్స్ కు ఓ స్పెషల్ కానుక ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ తాజాగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్ రంజాన్ సందర్భంగా చిత్రబృందం రిలీజ్ చేయనుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియా హ్యాష్ ట్యాగులతో ట్రెండింగ్ చేస్తున్నారు.

లాక్డౌన్లో కారణంగా సినిమాలకు సంబంధించి ఎలాంటి రిలీజ్ డేట్స్ అనౌన్స్ కావడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని రంజాన్ సందర్భంగా ప్రభాస్ కొత్త మూవీకి సంబంధించిన ఫస్టు రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుందట. ఈమేరకు చిత్రబృందం రాత్రింబవళ్లు కష్టపడుతుందని టాక్ విన్పిస్తుంది. అయితే దీనిపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏదిఏమైనా ప్రభాస్ సౌత్ తోపాటు నార్త్ పై స్పెషల్ ఫోకస్ పెట్టడంపై అభిమానులు ఖుషీ అవుతున్నారు. రంజాన్ సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు ట్రీట్ ఇస్తాడో లేదో వేచి చూడాల్సిందే..!