వ్యాపారము

ప్రజలకు తీపికబురు చెప్పిన కేంద్రం.. సులువుగా రూ.11,000 గెలుచుకునే ఛాన్స్?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో క్విజ్ పోటీలను నిర్వహించి ప్రజలకు వేర్వేరు పథకాల గురించి అవగాహనను కల్పించే ప్రయత్నం చేస్తోంది. కేంద్రం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ కూడా ఒకటి. ఎవరైతే ఈ పథకానికి సంబంధించిన క్విజ్ లో పాల్గొని విజేతగా నిలుస్తారో వాళ్లు 11,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లబ్ధిదారులు, వాళ్ల కుటుంబ సభ్యులు, సాధారణ ప్రజలు ఈ పథకానికి సంబంధించిన క్విజ్ లో పాల్గొనడంతో పాటు ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఈ పథకం గురించి పూర్తి అవగాహనను కలిగి ఉన్నవాళ్లు ఈ పథకానికి సంబంధించిన క్విజ్ లో పాల్గొంటే మంచిది. హిందీ, ఇంగ్లీష్ భాషలలో క్విజ్ ఉండగా ఈ క్విజ్ లో ఎంపికైన అభ్యర్థులకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి రివార్డ్ లభించే అవకాశాలు ఉంటాయి.

https://quiz.mygov.in/ లింక్ ద్వారా ఈ క్విజ్ లో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఈ క్విజ్ లో పాల్గొంటారో వాళ్లు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. వెబ్ సైట్ లో ఏడవ స్లయిడ్ ను క్లిక్ చేయడం ద్వారా క్విజ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ నెల 21వ తేదీ వరకు ఈ క్విజ్ ఉంటుంది. క్విజ్ లో పాల్గొనడం కొరకు ఒక మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీని ఒకటి కంటే ఎక్కువసార్లు ఉపయోగించడం సాధ్యం కాదు.

ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే క్విజ్ లో పాల్గొనే అవకాశం ఉండగా 300 సెకన్ల వ్యవధిలో గరిష్టంగా 15 ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన వ్యక్తి విజేతగా నిలుస్తారు. క్విజ్ లో పాలొనే వాళ్లు ఇతర వివరాలను అందజేయాల్సి ఉంటుంది. తప్పు జవాబుకు నెగిటివ్ మార్కింగ్ ఉండదని సమాచారం.

Back to top button