వ్యాపారము

మహిళల ఖాతాల్లోకి రూ.5 వేలు వేస్తున్న మోదీ.. ఎందుకంటే..?

ప్రధాని నరేంద్రమోదీ మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. మహిళల ఖాతాల్లోకి రూ.5 వేలు నగదు జమ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన స్కీమ్ కూడా ఒకటి. మహిళలు ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు రూ.5 వేలు పెన్షన్ ను పొందవచ్చు. కేంద్రం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నగదును జమ చేస్తోంది.

కేంద్రం అందిస్తున్న ఈ నగదు ఒకేసారి ఖాతాల్లో జమ కాదు. కేంద్రం విడతల వారీగా ఈ నగదును ఖాతాల్లోకి జమ చేస్తుంది. అయితే ప్రెగ్నెంట్ మహిళలు ఈ స్కీమ్ కు అర్హులు కానీ 19 సంవత్సరాల కంటే ముందే ప్రెగ్నెంట్ అయితే మాత్రం ఈ స్కీమ్ కు మహిళలు అర్హత పొందలేరు. ఈ స్కీమ్ లో తొలి విడత కింద 1,000 రూపాయలు మహిళల ఖాతాల్లో జమవుతాయి. తర్వాత మరో రూ.2 వేలు, చివరి విడతలో మరో రూ.2 వేలు జమవుతాయి.

ఈ విధంగా మొత్తం 5వేల రూపాయలు కేంద్రం మహిళల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందలేరు. www.pmmvy-cas.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ లో రిజిష్టర్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో నేరుగా ఈ స్కీమ్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ బెనిఫీషియరీ లాగిన్ ను క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొని లాగిన్ కావాల్సి ఉంటుంది.

మహిళలు సమీపంలోని ఆశావర్కర్ ను సంప్రదించి కూడా ఈ స్కీమ్ లో సులభంగా జాయిన్ కావచ్చు. ప్రెగ్నెంట్ అయిన మహిళలకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు.

Back to top button