టాలీవుడ్సినిమా

బాలయ్యతో లవ్ స్టోరీ.. బాధలో హీరోయిన్ !

Pragya Jaiswal Balayya
టాల్ బ్యూటీ ప్రగ్య జైస్వాల్ సక్సెస్ కోసం మొత్తం గ్లామర్ ను గుప్పించినా.. చివరకు చిన్నాచితకా సినిమాలతోనే పరిమితం అవాల్సి వస్తోంది. నిజానికి ఆమెకు అందం అభినయం ఇలా అన్ని ఉన్నా, అదృష్టం మాత్రం లేదు. లేకపోతే అవకాశాలు రాక, ఇష్టం లేని సినిమాలో నటించడం ఏమిటి ? అయినా నటించక ఏమి చేస్తుందిలే.. ఇక అవకాశాలు రావడం కష్టమే అనుకున్న తరుణంలో కదా.. ఆమెకు బాలయ్య బాబు సినిమాలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది.

Also Read: సత్తా చాటిన తెలుగు సినిమా.. జాతీయ పురస్కారాలు !

కాగా బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో రానున్న సినిమా అనగానే మంచి అంచనాలు ఉంటాయి. కాకపోతే.. బోయపాటి ప్రస్తుతం ఫామ్ లో లేకపోవడం, అలాగే బాలయ్య గత ఐదు సినిమాలు భారీ డిజాస్టర్ లుగా నిలవడంతో మొత్తానికి ఇప్పుడు వీరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకి అసలు మినిమమ్ క్రేజ్ కూడా లేదనేది ఇండస్ట్రీ టాక్. అందుకే, నిర్మాత కూడా తనకు ఎందుకొచ్చిన రిస్క్ అంటూ.. సినిమాకి ఓవర్ బడ్జెట్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ.. నయనతార ప్లేస్ లో ప్రగ్యని పెట్టుకుని సినిమాని పూర్తి చేస్తున్నాడు.

Also Read: ‘పుష్ప’లో పైశాచిక ఆనందం.. బన్నీ వల్లే !

అయితే ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ పాత్ర పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఆమె యంగ్ కలెక్టర్ పాత్రలో కనిపిస్తుందని.. ఒక కలెక్టర్ గా బాలయ్య పాత్ర చేసే మంచి పనులు చూసి లవ్ లో పడుతుందట. ఇంతవరకు బాగానే ఉంది గానీ, ప్రగ్య మాత్రం బాలయ్యతో లవ్ స్టోరీ అనగానే బాధ పడుతుందట. దీనికితోడు బాలయ్య – ప్రగ్య జోడి కూడా అంత గొప్పగా ఉండదు అని.. ఒకవేళ జోడీ బాగున్నా.. బాలయ్య పక్కన చేశాకా ఇక యంగ్ స్టార్ హీరోలు తమ పక్కన ఆమెకు ఛాన్స్ ఇవ్వరు అని.. ప్రగ్య తెగ పీల్ అవుతుందట.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button