సినిమాసినిమా వార్తలు

‘మా’లో మంటపుట్టిస్తున్న ప్రకాష్ రాజ్ ట్వీట్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా’ ఎన్నికలు రోజురోజుకీ మంటపుట్టిస్తున్నాయి. ఎన్నికల ప్రకటన రాకముందే పరిస్థితి వేడెక్కుతోంది. అభ్యర్థులు ఒకరిపై ఒకరు అవినీతి వ్యవహారాల్లో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇప్పటికే అధ్యక్షుడు నరేశ్ పై నటి హేమ చేసిన ఆరోపణలతో పెంట పెంట అయ్యింది.

ప్రస్తుతం ‘మా’ అధ్యక్ష ఎన్నికల కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, నటి హేమా, సీవీఎల్ నరసింహారావు పోటీపడుతున్న సంగతి తెలిసిందే.

గతంలో లోకల్ ,నాన్ లోకల్ అంటూ ప్రకాష్ రాజ్ ను అధ్యక్షుడిగా పోటీచేయడం మాకు ఇష్టం లేదని కొందరు నటులు అనగా.. ప్రకాష్ రాజ్ దీనికి గట్టి బదులిచ్చారు. ఇక ఎన్నికల జాప్యంతో ఆరోపణలతో ‘మా’ ప్రతిష్ట దిగజారుతోందని..వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చిరంజీవి డిమాండ్ చేశారు. క్రమశిక్షణ సంఘం చైర్మన్ కృష్ణంరాజుకు బహిరంగ లేఖ రాశారు.

ఈ వేడిని మరింత పెంచుతూ తాజాగా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశాడు. అదిప్పుడు వైరల్ గా మారింది. ఇవాళ తన ట్విట్టర్ ఖాతాలో ప్రకాష్ రాజ్ ‘జెండా’ ఎగురవేస్తాం అంటూ ట్వీట్ చేశారు. దీంతో సినిమా పరిశ్రమలో మరోసారి ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్ అవుతోంది.

గతంలోనూ ప్రకాష్ రాజ్ ‘మా’ ఎన్నికలపై పరోక్షంగా చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. పదిరోజుల కిందట కూడా ‘తెగేదాకా లాగొద్దు’ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు జెండా ఎగురవేస్తాం అంటూ మరో ట్వీట్ చేశారు.

Back to top button